ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని ఎస్కేప్.. ఆమెకు ఎయిడ్స్ ఉందని తెలిసి..

ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని ఎస్కేప్.. ఆమెకు ఎయిడ్స్ ఉందని తెలిసి..
మహానగరంలో మాయగాళ్లే కాదు.. మాయ లేడీలు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.. అమాయకంగా ఫేస్ పెట్టి అతగాడ్ని బుక్ చేస్తుంది.

మహానగరంలో మాయగాళ్లే కాదు.. మాయ లేడీలు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.. అమాయకంగా ఫేస్ పెట్టి అతగాడ్ని బుక్ చేస్తుంది. ఆ తరువాత అసలు విశ్వ రూపం చూపిస్తుంది. ఆ విధంగా ఒకరూ ఇద్దరు కాదు.. ఎనిమిది మందితో వ్యవహారం నడిపి పెళ్లి కూడా చేసుకునేది.. వారం రోజులు గడిచాక నానా యాగీ చేసి నగలు, నగదు తీసుకుని ఉడాయించేది. పోలీసులకు పట్టుబడిన ఆమెను వైద్య పరీక్షలకు పంపగా ఎయిడ్స్ అని తేలింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న ఎనిమిది మంది భర్తలు తల పట్టుకుంటున్నారు. ఈ ఉదంతం పంజాబ్‌లో చోటు చేసుకుంది.

నిందితురాలు హర్యానాలోని కైతాల్ జిల్లా నివాసి. వయస్సు 30 సంవత్సరాలు. నిందితురాలి నిజమైన వివాహం 2010 లో పాటియాలాలో జరిగింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. వారి వయస్సు ఇప్పుడు 7-9 సంవత్సరాల మధ్య ఉంది. వివాహమైన కొన్ని సంవత్సరాలకు అకస్మాత్తుగా ఆమె భర్త అదృశ్యమయ్యాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కుటుంబ పోషణ కష్టమైంది. ముగ్గురు పిల్లలను పెంచాలంటే ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించింది. తల్లితో కలిసి పథకం వేసింది.

ఈజీగా డబ్బు సంపాదించే మార్గం ఆలోచించింది. నాలుగు సంవత్సరాల క్రితం దొంగ వధువుగా అవతారమెత్తింది. ఆ తర్వాత ఆమె పంజాబ్ మరియు హర్యానాలలో ఒంటరిగా ఉన్న లేదా విడాకులు లేదా వితంతువు పురుషులను ట్రాప్ చేయడం ప్రారంభించేది. ఆమె వలలో చిక్కిన పురుషుడిని వివాహం చేసుకుని వారం రోజులు అతడితో సఖ్యతగా ఉండేది. ఆ తరువాతే అసలు కథ మొదలయ్యేది. ఏదో ఒక విషయంలో భర్తతో, అత్తమామలతో గొడవపెట్టుకునేది.. ఈ గొడవ పంచాయితీ పెద్ద వరకు వెళ్లేది. పరిష్కారం కోసం కొంత డబ్బు ముట్టజెబితే అది తీసుకుని ఉడాయించేది.

ఇంకో చోట కూడా సేమ్ స్టోరీ రిపీటయ్యేది. ఈ విధంగా మొత్తం ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో పెళ్లికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. పోలీసుల ఎంక్వైరీలో ఆమె బండారం మొత్తం బయటపడింది. ఆమె వెనుక ఉండి నడిపిస్తున్న ముఠాను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితులు పంజాబ్‌తో పాటు హర్యానాలో కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. కాగా, ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆమెకు వైద్య పరీక్షల్లో ఎయిడ్స్ అని తేలింది.

Tags

Read MoreRead Less
Next Story