శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. సొంత అన్న, చెల్లెలను నరికి చంపిన తమ్ముడు..!

సొంత అన్నను, చెల్లెలను నరికి చంపాడో కసాయి తమ్ముడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ రామచంద్రాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. సొంత అన్న, చెల్లెలను నరికి చంపిన తమ్ముడు..!
X

సొంత అన్నను, చెల్లెలను నరికి చంపాడో కసాయి తమ్ముడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ రామచంద్రాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భూములు అమ్మగా వచ్చిన డబ్బులు.. వీరి ప్రాణాలు తీసేలా చేసింది. వీరి పేరిట ఉన్న పొలాలు అమ్మగా.. 16 లక్షలు రూపాయలు రావడంతో ముగ్గురూ సమానంగా పంచుకున్నారు.

అయితే చెల్లెలు జయమ్మ వికలాంగురాలు కావడం... ఇంకా పెళ్లి కాకపోవడంతో.. తన అన్నకు ఎక్కడ డబ్బులు ఇస్తుందోనని తమ్ముడు రామకృష్ణ అనుమానించాడు. దీంతో డబ్బు కోసం అన్న సన్యాసిరావు, చెల్లెలు జయమ్మను తమ్ముడు రామకృష్ణ హతమార్చాడు.

వచ్చే మే నెలలో సన్యాసిరావు కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా.. ఈ ఉదంతం చోటుచేసుకోవడంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES