ఆర్మీ అధికారి, భార్య అరెస్ట్.. ఇంట్లో పనిచేస్తున్న బాలికను వేధించడంతో..

ఆర్మీ అధికారి, భార్య అరెస్ట్.. ఇంట్లో పనిచేస్తున్న బాలికను వేధించడంతో..
అస్సాంలోని హఫ్లాంగ్‌లో ఆర్మీ అధికారి, అతని భార్య తమ ఇంట్లో పని చేస్తున్న 16 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసిన ట్లు ఫిర్యాదు అందడంతో వారిని అరెస్టు చేశారు.

అస్సాంలోని హఫ్లాంగ్‌లో ఆర్మీ అధికారి, అతని భార్య తమ ఇంట్లో పని చేస్తున్న 16 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసిన ట్లు ఫిర్యాదు అందడంతో వారిని అరెస్టు చేశారు. కాలిన గాయాలు, విరిగిన పళ్ళు, ముక్కు, చెవితో సహా బాలిక అత్యంత దయనీయంగా మారింది. బాలిక పట్ల ఆ దంపతులు క్రూర మృగాల్లా ప్రవర్తించారు. ఏ మాత్రం కనికరం లేకుండా కర్కశంగా హింసించారు. చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్‌లో తమ ఇంటి పనిమనిషిపై దారుణంగా దాడి చేసినందుకు ఆర్మీ అధికారి మరియు అతని భార్యను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ జంటను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బాలిక గత రెండేళ్లుగా ఆర్మీ అధికారి నివాసంలో ఉద్యోగం చేస్తోంది. సుమారు ఒక సంవత్సరం పాటు శారీరక వేధింపులను భరించింది. ఆమె శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి.

సెప్టెంబరు 24న సోషల్ మీడియాలో బాలిక వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే చర్య తీసుకున్న పోలీసులు సెప్టెంబర్ 25న ఆర్మీ అధికారిని, అతని భార్యను అరెస్టు చేశారు. "కఠినమైన POCSO మరియు SC/ST చట్టాలు మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద భార్యాభర్తల మీద కేసు నమోదు చేయబడింది.

Tags

Read MoreRead Less
Next Story