Gugugram: పరీక్షల ఒత్తిడి.. టెన్షన్‌తో విద్యార్థి..

Gugugram: పరీక్షల ఒత్తిడి.. టెన్షన్‌తో విద్యార్థి..
Gugugram: మార్చి వచ్చిందంటే పరీక్షల సీజన్ మొదలవుతుంది. ఏడాది కాలంగా చదివిన విద్యార్థి భవితవ్యాన్ని తెలిపేది పరీక్షలే.. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లది, తల్లిదండ్రులది..

Gugugram: మార్చి వచ్చిందంటే పరీక్షల సీజన్ మొదలవుతుంది. ఏడాది కాలంగా చదివిన విద్యార్థి భవితవ్యాన్ని తెలిపితే పరీక్షలే.. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లది, తల్లిదండ్రులది.. కానీ కొంతమంది టీచర్లు ర్యాంకుల కోసం, తమ సంస్థల పేరు కోసం విద్యార్ధులపై ఒత్తిడి తెస్తుంటారు. అదే విద్యార్ధులను ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. గురుగ్రామ్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షల ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థి తన ఫ్లాట్‌లోని 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సౌత్ సిటీ 1లోని రిట్రీట్ సొసైటీలో నివసిస్తున్న 17 ఏళ్ల యువకుడు పరీక్షల గురించి ఆందోళన చెందేవాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. తన ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శబ్దం విన్న సొసైటీ సెక్యూరిటీ గార్డులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కాని వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story