పోలీసు స్టేషన్ లో భద్రపరిచిన సొమ్ము రూ.16లక్షలతో ఉడాయించిన కానిస్టేబుల్

కృష్ణాజిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్థన్ నాయుడు రూ. 16లక్షలు తీసుకుని పరారయ్యాడు.

పోలీసు స్టేషన్ లో భద్రపరిచిన సొమ్ము రూ.16లక్షలతో ఉడాయించిన కానిస్టేబుల్
X

కృష్ణాజిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్థన్ నాయుడు రూ. 16లక్షలు తీసుకుని పరారయ్యాడు. స్టేషన్ లో భద్రపరిచిన ప్రభుత్వ మద్యం దుకాణాల డిపాజిట్ సొమ్మును బ్యాంకులో వేసేందుకు తీసి లెక్కచూడగా రూ.16లక్షలు తగ్గినట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆరాతీయగా ఆ డబ్బు కానిస్టేబుల్ జనార్దన్ నాయడు డబ్బు కాజేసినట్లు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి స్వస్థలం విశాఖపట్నంలో ఉండి ఉండొచ్చని సమాచారం అందడంతో పోలీసు బృందం అక్కడికి బయలుదేరింది.

Next Story

RELATED STORIES