అప్పులు తీర్చే మార్గం లేక ఆన్‌లైన్‌లో కిడ్నీలు అమ్మబోతే..

Cyber Fraud: ఆదాయానికి మించి అప్పులు చేశారు. అవి తీర్చే మార్గం లేక కిడ్నీలు అమ్ముదామనుకున్నారు. ఏది అమ్మాలన్నా కొనాలన్నా ఆన్‌లైన్ ఉంది కదా అని ఆశ పడ్డారు.

అప్పులు తీర్చే మార్గం లేక ఆన్‌లైన్‌లో కిడ్నీలు అమ్మబోతే..
X

Cyber Fraud

Cyber Fraud: ఆదాయానికి మించి అప్పులు చేశారు. అవి తీర్చే మార్గం లేక కిడ్నీలు అమ్ముదామనుకున్నారు. ఏది అమ్మాలన్నా కొనాలన్నా ఆన్‌లైన్ ఉంది కదా అని ఆశ పడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. మరికొన్ని అప్పులు మిగిలాయి. అన్‌లైన్ మోసాలు ప్రతి రోజు వింటూనే ఉన్నా మళ్లీ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఈ మోసాలకు బలవుతూనే ఉంటారు. తాజాగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన మోది వెంకటేశ్, లావణ్య దంపతులు స్థానికంగా స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. ఇందుకోసం ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా రూ.44లక్షలు రుణం కూడా తీసుకున్నారు. నాలుగంతస్తుల మేడ కట్టేందుకు రూ.1.50 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది.

ఇంతలో కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం మూతపడింది. పైసా వచ్చే మార్గం కనిపించలేదు. కానీ చేసిన అప్పు ఆ దంపతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి కూడా పెరగడంతో మరో మార్గం లేక ఇద్దరి కిడ్నీలు అమ్మి అప్పు తీర్చాలనుకున్నారు.

కిడ్నీలు కొనేవారి గురించి ఆన్‌లైన్‌లో అన్వేషించారు. ఓ వ్యక్తి పరిచయమై రిజిస్ట్రేషన్ ఫీజు కోసం కొంత నగదు కట్టమన్నాడు. అడిగినంత చెల్లించిన తరువాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్సేంజి కోసమంటూ మరి కొంత కట్టించుకున్నాడు. ఇలా ఆ వ్యక్తికి దంపతులు రూ.10 లక్షల వరకు కట్టారు. మరో మారు కూడా ఏదో ఒక సాకు చెప్పి మరికొంత నగదు అడగబోతే.. అతడిని కాదని మరో వ్యక్తిని సంప్రదించారు.

అతడు కూడా రూ.12 లక్షల వరకు కట్టించుకున్నాడు. ఈ విధంగా ఆన్‌లైన్‌లో నలుగురిని సంప్రదించారు. నలుగురు నాలుగు విధాలుగా మోసం చేశారు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలు మీకు రావలసి అమౌంట్‌లో సగం అకౌంట్‌లో జమ అవుతుందని చెప్పాడు. అతడు చెప్పినట్టుగా నగదు జమ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. కానీ డ్రా చేయబోతే నగదు రాలేదు. తిరిగి ఆ వ్యక్తిని సంప్రదించగా.. ఆర్థకశాఖ, ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ, ఆదాయపు పన్ను శాఖల నుంచి సర్టిఫికెట్లు అవసరమంటూ మరికొంత డబ్బులు కట్టించుకున్నాడు. ఆ తరువాత అతడు అడ్రస్ లేడు. మరో వ్యక్తి డబ్బు తీసుకునేందుకు బెంగళూరు రమ్మన్నాడు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చి వారికి ఇవ్వాల్సిన నోట్ల కట్టలు చూపించారు.

నోట్లు నలుపు రంగులో ఉండడంతో అలా ఉన్నాయేంటని ప్రశ్నించారు దంపతులు. ఇదంతా ఆర్బీఐ డబ్బు అని, వీటిని రసాయనాలతో శుభ్రం చే్స్తే మామూలుగానే ఉంటాయన్నారు. దంపతుల కళ్లముందే వాటిని శుభ్రం చేసి చూపించారు. దాంతో సరే అన్న దంపతులకు ఓ ప్యాకెట్ ఇచ్చి 48 గంటల వరకు తెరవకూడదన్నారు. తీరా హైదరాబాద్ వచ్చాక ప్యాకెట్ తెరిచి చూసుకుంటే ఏముంది.. అన్నీ దొంగ నోట్లని తెలుసుకున్నారు. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుని సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES