దారుణం.. డిగ్రీ విద్యార్థిని రోజూలాగనే కాలేజీకి వెళ్లింది.. కానీ..

దారుణం.. డిగ్రీ విద్యార్థిని రోజూలాగనే కాలేజీకి వెళ్లింది.. కానీ..
విష్ణువర్ధన్‌‌ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లాడు.

నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని. రోజూలాగనే కాలేజీకి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. మృగాడి దాడిలో విగత జీవిగా మారింది. ఈ ఘటన.... రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వివిధ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.

గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష.. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన విష్ణువర్ధన్‌‌ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కళాశాల విద్యార్థులు, కుటుంబసభ్యులు మార్చురీ వద్ద నుంచి మృతదేహంతో పల్నాడు రోడ్డు కూడలికి చేరుకొని ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని వారు చెప్పారు. సమాచారం అందుకున్న తెదేపా, సీపీఐ, పలు సంఘాల నేతలు ధర్నా ప్రాంతానికి చేరుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. సుమారు మూడు గంటలుగా ధర్నా కొనసాగింది. రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. దిశ చట్టం అంటూ మాయ చేశారని ధ్వజమెత్తారు. కళ్ల ఎదుటే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా.. జగన్‌రెడ్డిలో ఎలాంటి చలనం రావడం లేదని లోకేష్‌ తప్పుబట్టారు. నరసరావుపేటలో అనూష హత్యను ఖండిస్తున్నామని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story