Gujarath: తండ్రెందుకు ఇలా తయారవుతున్నాడు.. పదేళ్ల కూతురిపై..

Gujarath: తండ్రెందుకు ఇలా తయారవుతున్నాడు.. పదేళ్ల కూతురిపై..
Gujarath: బూచీ అంటే భయమెందుకు నాన్నా అని బుజ్జగించి చెప్పే నాన్న ఓ భయంకరమైన భూతంలా తయారవుతున్నాడు..

Gujarath: బూచీ అంటే భయమెందుకు నాన్నా అని బుజ్జగించి చెప్పే నాన్న ఓ భయంకరమైన భూతంలా తయారవుతున్నాడు.. నాన్నచేతిలోనే అత్యాచారానికి గురైన ఆ పసి మనసు ఎంత క్షోభకు గురవుతుందో.. అమ్మానాన్నల దగ్గరే రక్షణ లేకుండా పోతున్న ఆ పసి ప్రాయం పెరిగి పెద్దవడం ఎలా.. సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.. మానవ సంబంధాలన్నీ మంటగలిసిపోతున్నాయి.. తండ్రి, అన్న, తమ్ముడు, ఉపాధ్యాయుడు ఎక్కడా ఆడపిల్లకు లేదు రక్షణ.. తాజాగా జరిగిన సంఘటన సమాజం మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించింది.

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ పట్టణంలోని సార్థనా ప్రాంతంలో పదేళ్ల బాలికపై గుర్తు తెలియని నిందితులు గురువారం అత్యాచారం చేశారు. బాలికపై జరిగిన అత్యాచార ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. పోలీసుల విచారణలో బయటపడిన విషయం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అమాయక బాలికపై అత్యాచారం చేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాదు. స్వయంగా ఆమె కన్న తండ్రి. ప్రస్తుతం బాధిత బాలిక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఇంటికి సమీపంలోని ఓ దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసు బృందం పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. మధ్యాహ్నం తండ్రి భోజనానికి ఇంటికి వచ్చాడు. కన్న కూతురిపై అత్యాచారం చేసిన తర్వాత తానే స్వయంగా బాలికను సమీపంలోని క్లినిక్‌కి తీసుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత తండ్రి పోలీసుల కాళ్లు పట్టుకుని - సార్! నేను పెద్ద తప్పు చేశాను. కామంతో కళ్లు మూసుకుపోయి నా బిడ్డపై అత్యాచారం చేసాను.. నా ఏ శిక్ష విధించినా తప్పులేదు.. అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.

ఆసుపత్రిలో పోలీసులు బాలికను విచారించగా.. తండ్రి తనపై అత్యాచారం చేశాడని బాలిక, ఆమె సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. నిందితుడు అంతకు ముందు ఏమీ మాట్లాడలేదు, కానీ కుమార్తెలు ఫిర్యాదు చేయడంతో బోరున విలపించి అసలు విషయం చెప్పాడు. తనదే తప్పని ఒప్పుకున్నాడు.. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story