తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. భవనం ముందు ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.అయితే... ఇప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు.

ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు కోట్ల విలువైన ఫొటోలు దగ్ధమయ్యాయి. లావణ్య ఫొటో ఫ్రేమ్స్ షాపు లో దేవుళ్లకు సంబంధించిన వేలాది ఫొటోలు ఉంటాయి. మరోవైపు ఈ బిల్డింగ్ పక్కనే గోవిందరాజు స్వామి వారి ఆలయ రథం ఉంది. మంటల సెగ రథానికి తగులుతోంది. రథం మంటపం వరకు మంటలు వ్యాపించాయి. షాపు ముందున్న వాహనాలు తగలబడిపోతున్నాయి. మూడు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 30 మంది ఫైర్ సిబ్బంది, 40 మంది పోలీసులు, వందమందికిపైగా యువత శ్రమించిన మంటల్ని అదుపులో తెస్తున్నారు. ఫైర్ ఇంజన్లు సరిపోకపవోడంతో నగరపాలక సంస్థకు చెందిన వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని తీసుకొచ్చిన మంటల్ని అదుపు చేస్తున్నారు.

అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రమాద స్థలానికి దగ్గర్లో గోవిందరాజస్వామి ఆలయానికి చెందిన రథం ఉండటంతో పోలీసులు, టీటీడీ అప్రమత్తమయ్యారు. మంటలు మరింత పెరిగితే రథానికి నిప్పంటుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రథాన్ని అక్కడనుంచి తరలిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా గాంధీనగర్ - రైల్వే స్టేషన్ రోడ్లలో యాత్రికులు రాకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story