Crime News: మార్కుల జాబితా ఇవ్వలేదని మాజీ విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్‌పై..

Crime News: మార్కుల జాబితా ఇవ్వలేదని మాజీ విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్‌పై..
Crime News: ఆవేశం.. వెనుకా, ముందూ ఏమీ ఆలోచించకుండా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు.

Crime News: ఆవేశం.. వెనుకా, ముందూ ఏమీ ఆలోచించకుండా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు. ఉత్త పుణ్యానికి నిండు జీవితాలను బలి ఇచ్చేస్తున్నారు. మార్కుల జాబితా ఇవ్వలేదని మాజీ విద్యార్ధి కాలేజీ ప్రిన్సిపల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ఆమె. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భీమా కళాశాల ప్రిన్సిపాల్ తన మార్కు షీట్‌ను పొందడంలో జాప్యం చేసినందుకు మాజీ విద్యార్థి ఆగ్రహంతో ఊగిపోయాడు. అశుతోష్ శ్రీవాస్తవ అనే నిందితుడు 49 ఏళ్ల ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

బాధితురాలు కళాశాల భవనం వైపు పరుగులు తీయడంతో కళాశాల సిబ్బంది మంటలను ఆర్పివేసి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నిందితునికి కూడా గాయాలయ్యాయి. పారిపోయేందుకు ప్రయత్నించగా కాలేజీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఇండోర్ ఎస్పీ (రూరల్) భగవత్ సింగ్ బిర్డే మాట్లాడుతూ.. విద్యార్థి ఏడో సెమిస్టర్ ఫెయిల్ అయినట్లు గుర్తించాం.. ఎనిమిదో సెమిస్టర్‌లో పరీక్షకు హాజరై ఉత్తీర్ణుడయ్యాడని, మార్కు షీట్ రాలేదని తీవ్రంగా కలత చెందాడు. ఘటన అనంతరం అశుతోష్ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని అన్నారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story