సోదరుడికి కిడ్నీ దానం చేసిందని.. భార్యకు వాట్సాప్‌లో 'ట్రిపుల్ తలాక్' చెప్పిన భర్త

సోదరుడికి కిడ్నీ దానం చేసిందని.. భార్యకు వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
భార్య ఉచితంగా కిడ్నీని సోదరుడికి దానం చేసిన తర్వాత భర్త వాట్సాప్‌లో 'ట్రిపుల్ తలాక్' అని మెసేజ్ చేశాడు.

భార్య ఉచితంగా కిడ్నీని సోదరుడికి దానం చేసిన తర్వాత భర్త వాట్సాప్‌లో 'ట్రిపుల్ తలాక్' అని మెసేజ్ చేశాడు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడికి ఆ మహిళ తన కిడ్నీని దానం చేసి అతడి ప్రాణాలు కాపాడింది. తోడబుట్టిన వాడు కావడంతో డబ్బులు ఏమీ తీసుకోవాలనుకోలేదు. దాంతో భర్తకు చిర్రెత్తుకొచ్చింది. అసలే కిడ్నీలకు అత్యధిక డిమాండ్ ఉంది. అలాంటిది దాన్ని ఉచితంగా ఇస్తావా అని భార్య మీద ఆగ్రహం చెందాడు.

రూ. 40 లక్షలు డిమాండ్ చేయమంటే ఒక్క పైసా కూడా అడగనందుకు భార్యకు వాట్సాప్ సందేశం ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. 42 ఏళ్ల తరన్నమ్ భర్త అబ్దుల్ రషీద్‌ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో నివసిస్తోంది. తరన్నమ్ సోదరుడు మహ్మద్ షకీర్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలను కాపాడటానికి, ఆమె తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది.

అయితే కిడ్నీ మార్పిడికి బదులుగా తన సోదరుడి నుంచి రూ.40 లక్షలు ఇవ్వాలని భర్త రషీద్ ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. "నేను నిరాకరించినప్పుడు, అతను వాట్సాప్ ద్వారా 'ట్రిపుల్ తలాక్' చెప్పాడని భార్య చెప్పింది.

తరన్నం అనే 42 ఏళ్ల మహిళ తన భర్త అబ్దుల్ రషీద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై వరకట్న నిషేధ చట్టం మరియు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని ఇతర సెక్షన్లతో పాటు ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 కింద కేసు నమోదు చేయబడింది. ముఖ్యంగా, 2019లో దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమైనది మరియు రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించబడింది మరియు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడింది.

Tags

Read MoreRead Less
Next Story