సొంత కుమార్తెలను హత్య చేసిన కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తల్లి పద్మజలో ఎక్కడా కనపడని పశ్చాత్తాపం.

సొంత కుమార్తెలను హత్య చేసిన కేసులో తల్లిదండ్రులు అరెస్ట్
X

చిత్తూరు జిల్లాలో సొంత కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో ఎట్టకేలకు తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలు జరిగిన 32 గంటల తర్వాత నిందితులను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి నేరుగా కోర్టులో హాజరుపరిచారు. బయటకు వచ్చి పోలీస్ వాహనం ఎక్కేటప్పుడు తల్లి పద్మజలో ఎక్కడా కూతుళ్లను చంపినా పశ్చాత్తాపం కనపడలేదు. ఏదో పిచ్చిపట్టినట్లు చేతులు ఊపుకుంటూ చక్కగా పోలీస్ వాహనం ఎక్కి కూర్చుంది.

కరోనా టెస్టుల కోసం మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ ఆస్పత్రి సిబ్బంది, పోలీసులకు చుక్కలు చూపించింది. తానే శివుడినని.. తనకు కరోనా టెస్ట్ ఏంటని దబాయించింది. కరోనా చైనా నుంచి రాలేదు.. శివుడి నుంచి వచ్చిందని తెలిపింది. ఆమె భర్తను కూడా అతను నా భర్త కాదంటూ పేర్కొంది. తాను సాక్షాత్తూ భగవత్ స్వరూపమని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది.


Next Story

RELATED STORIES