పెళ్లి షాపింగ్‌కి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో కాబోయే దంపతులు..

అతడితో ఆమె జీవితాన్ని పంచుకోవాలనుకుంది. మూడు ముళ్లు వేయించుకుని ముచ్చటగా కాపురం చేయాలనుకుంది.

పెళ్లి షాపింగ్‌కి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో కాబోయే దంపతులు..
X

అతడితో ఆమె జీవితాన్ని పంచుకోవాలనుకుంది. మూడు ముళ్లు వేయించుకుని ముచ్చటగా కాపురం చేయాలనుకుంది. కానీ మృత్యువు కాచుక్కూర్చుని ఉంది వారిద్దరినీ ఒక్కటి చేయకూడదు, ఒక్కసారే తీసుకెళ్లి పోవాలని.. అందుకే పెళ్లి పీటలు ఎక్కకముందే చంపేసింది. ఈ విషాద సంఘటన అన్నూరు - మెట్టుపాళ్యం రోడ్డులో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మరణించగా యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

అన్నూరుకు చెందిన అజిత్‌కుమార్ (25)కు, తలతురైకి చెందిన కె. ప్రియాంక (19)కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా పూర్తయింది. పెళ్లికి సంబంధించిన షాపింగ్‌లో భాగంగా బంగారం కొనేందుకు కాబోయే వధూవరులు బైక్‌పై వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌‌ను ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో అజిత్, ప్రియాంక మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రియాంకతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అజిత్‌కుమార్ వివాహం సెప్టెంబర్ 10 న జరగాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అజిత్‌కుమార్ తన మోటార్‌సైకిల్‌పై తలతురై నుండి ప్రియాంకను తీసుకొని, కొనుగోలు కోసం మెట్టుపాళ్యానికి తీసుకెళ్లాడు. వారు జఠాయంపాలయంలో మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో తలత్తురైకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఎదురుగా మోటార్‌సైకిల్‌పై వస్తున్న దంపతులు (అలముద్దీన్, సాధిఖలి) తీవ్రగాయాలతో కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలముద్దీన్ పై సిరుముగై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES