భారీ చోరీ.. సెల్ ఫోన్ల కంటైనర్ హైజాక్..!

Andhra Pradesh:ఆరున్నర కోట్ల విలువైన రెడ్‌మీ ఫోన్లను కొట్టేశారు దుండగులు.

భారీ చోరీ.. సెల్ ఫోన్ల కంటైనర్ హైజాక్..!
X

Andhra Pradesh: ఆరున్నర కోట్ల విలువైన రెడ్‌మీ ఫోన్లను కొట్టేశారు దుండగులు. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్‌ను వెంబడించిన ఆరుగురు దుండగులు.. డ్రైవర్‌ను చితకబాది ఫోన్లను ఎత్తుకెళ్లారు. కారులో వచ్చిన ఆరుగురు దుండగులు కంటైనర్‌ను వెంబడించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని నెంగలి చెక్ పోస్ట్ దాటిన తరువాత కంటైనర్‌ను ఆపారు. డ్రైవర్‌ సురేష్‌ను కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి, అడవిలో వదిలిపెట్టారు. కంటైనర్‌లో ఉన్న ఆరున్నర కోట్ల విలువైన ఫోన్లను దోచుకెళ్లారు.

మొన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాళ్లు, చేతులు కట్టేయడం, నోట్లో గుడ్డలు కుక్కి అడవిలో వదిలేయడంతో.. అడవి నుంచి బయటకు రావడానికి సాయంత్రం అయింది. స్థానికుల సహాయంతో డ్రైవర్ సురేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కోలారు ఎస్పీ కిషార్ బాబు.. ఎమ్ఐ ఫోన్ల చోరీ దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. గతంలో ఆంధ్ర, తమిళనాడులో ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వారి సహకారం కూడా తీసుకుంటామన్నారు ఎస్పీ.

Next Story

RELATED STORIES