కొడుకు దొంగతనం.. కేసుభయంతో ఆత్మహత్యే శరణ్యమని తల్లీ కొడుకులు..

అమ్మకి ఆ విషయం తెలిసి కొడుకుని మందలించింది. ఈలోపు వాహనదారుడు బైక్ పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.

కొడుకు దొంగతనం.. కేసుభయంతో ఆత్మహత్యే శరణ్యమని తల్లీ కొడుకులు..
X

కొడుకు చేసిన బైక్ దొంగతనం తల్లీ బిడ్డల ప్రాణాలు బలితీసుకుంది. బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో వెలుగు చూసింది. కొడుకు మోహన్ గౌడ (18) కొత్త బైక్ అడిగాడు. కొనలేక పోయింది తల్లి. దాంతో బైక్ దొంగతనం చేశాడు. అమ్మకి ఆ విషయం తెలిసి కొడుకుని మందలించింది.

ఈలోపు వాహనదారుడు బైక్ పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అరెస్టుకు భయపడిన మోహన్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లి లీలావతి అతడి మరణ వార్త విని హతాశురాలైంది. పోలీసులు తనని కూడా విచారిస్తారని భయపడి కారుకు తల కొట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES