కన్న తల్లినే కడతేర్చిన కూతురు

కన్న తల్లినే కడతేర్చిన కూతురు
సొంత తల్లినే చంపిన కూతురు పోలీస్టేషన్ లో లొంగిపోయింది.

బెంగుళూరులో దారుణం చోటుచేసుకుంది. సొంత తల్లినే చంపిన కూతురు పోలీస్టేషన్ లో లొంగిపోయింది. ఒక మహిళ సూట్ కేస్ తో సోమవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. ఆమె సూట్ కేసులో శవం ఉందని చెప్పిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. సూట్ కేసు తెరిచి చూడగా... ఒక మహిళా శవం కనపడడంతో పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ శవం ఆమె అమ్మదేనని మహిళ చెప్పింది. తానే చంపినట్లుగా ఒప్పుకొని లొంగిపోయింది.

సూట్ కేసు లో తన తల్లి మృత దేహంతో పాటు చనిపోయిన మృతురాలి భర్త ఫోటో కూడా ఉంది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. సదరు మహిళ వెస్ట్ బెంగాల్ కి చెందిన ఫిజియోథెరపిస్ట్ అని తేలింది. కొన్ని రోజుల నుండి తన తల్లితో గొడవ పడుతున్నట్లు చెప్పింది. పథకం ప్రకారం తన భర్త తో కలిసి తన తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపినట్లుగా పోలీసులకు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story