Crime News: అమ్మ దుర్మార్గం.. సహజీవనానికి అడ్డొస్తున్నారని ముగ్గురు చిన్నారులను..

Crime News: అమ్మ దుర్మార్గం.. సహజీవనానికి అడ్డొస్తున్నారని ముగ్గురు చిన్నారులను..
Crime News: లోకం పోకడ తెలియని ముగ్గురు చిన్నారులు (8,7,5) బిక్కు బిక్కు మంటూ అటూ ఇటూ చూస్తున్నారు.. ఎక్కడున్నామో తెలియదు.. ఎటు వెళ్లాలో తెలియదు..

Crime News: లోకం పోకడ తెలియని ముగ్గురు చిన్నారులు (8,7,5) బిక్కు బిక్కు మంటూ అటూ ఇటూ చూస్తున్నారు.. ఎక్కడున్నామో తెలియదు.. ఎటు వెళ్లాలో తెలియదు.. అమ్మ ఎందుకు తమని ఒంటరిగా వదిలేసిందో తెలియదు. దిక్కుతోచని స్థితిలో చుట్టూ చూస్తున్న ఆ అమాయకపు పిల్లలను ట్రాఫిక్ పోలీస్ గమనించారు.




వాళ్లవాలకం చూసి తప్పి పోయారేమో అనుకున్నారు.. కానీ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఎంక్వైరీ చేయగా తమది రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్, భగత్ సింగ్ కాలనీ అని తెలిపారు. ఈ సమాచారంతో అక్కడ ఇరుగు పొరుగు వారిని విచారించగా ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులది ప్రేమ వివాహమని, పిల్లలు పుట్టాక గొడవలతో ఇద్దరూ విడిపోయారని చెప్పారు. అనంతరం ఆమె మరొకరితో సహజీవనం సాగిస్తోందని, వాళ్లిద్దరికీ ఒక పాప కూడా పుట్టిందని తెలిపారు.




బంధువుల గురించి విచారించగా పెదనాన్న ఉన్నట్లు తెలిసి స్టేషన్‌కు పిలిపించారు అతడిని.. కానీ వీళ్లు తన తమ్ముడి పిల్లలే అయినా, అతడే వాళ్లని వదిలేసి వెళ్లిపోయాడు.. నాకు మాత్రం ఏంటి సంబంధం అని వెళ్లిపోయాడు. చేసేది ఏమీ లేక పోలీసులు ముగ్గురు చిన్నారులను బాలల సంరక్షణా కేంద్రంలో ఉంచారు. రెండు రోజుల తరువాత చిన్నారులను విచారించగా తమను ఈనెల 14 అర్థరాత్రి తన తల్లి, మరో వ్యక్తి కలిసి ఆటోలో యాదగిరి గుట్టకు తీసుకు వచ్చి, కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి వదిలేశారని తెలిపారు.




ఆ తరువాత తాను కట్లు విప్పుకుని చెల్లిని, తమ్ముడిని విడిపించినట్లు పేర్కొన్నాడు. సహజీవనానికి ముగ్గురు పిల్లలు అడ్డొస్తున్నారని తల్లి ఈ విధంగా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్ శిశువిహార్‌లో ఉంచారు. ట్రాఫిక్ పోలీస్ కోటి ఈ పిల్లల్ని సంరక్షించి స్టేషన్‌కు చేర్చి బాధ్యతగా వ్యవహరించినందుకు అతడిని పై అధికారులు ప్రశంసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story