Crime News: బీఈడీ విద్యార్థి పైశాచిక ఆనందం.. హాస్టల్‌ అమ్మాయిల న్యూడ్ ఫోటోలను స్నేహితుడికి పంపుతూ..

Crime News: బీఈడీ విద్యార్థి పైశాచిక ఆనందం.. హాస్టల్‌ అమ్మాయిల న్యూడ్ ఫోటోలను స్నేహితుడికి పంపుతూ..
Crime News: హాస్టల్లో ఉంటూ తోటి విద్యార్ధులు స్నానం చేస్తున్న ఫోటోలు, వీడియోలను స్నేహితుడికి చేరవేస్తోంది బీఈడి చదువుతున్న ఓ విద్యార్థిని.

Crime News: హాస్టల్లో ఉంటూ తోటి విద్యార్ధులు స్నానం చేస్తున్న ఫోటోలు, వీడియోలను స్నేహితుడికి చేరవేస్తోంది బీఈడి చదువుతున్న ఓ విద్యార్థిని.

యువతి తన సన్నిహిత ఫొటోలు, వీడియోలను వాట్సాప్‌లో పంపడాన్ని హాస్టల్ మేట్ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. "ఆ అమ్మాయి మార్చి నుంచి వర్కింగ్ ఉమెన్ కమ్ పీజీ హాస్టల్‌లో ఉంటోంది. ఆమె తన హాస్టల్ మేట్స్ నగ్నంగా స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకునే దృశ్యాలను ఫోటోలు, వీడియోలను తీసి, వాటిని ఆషిక్‌కు పంపేది" అని పోలీసులు తెలిపారు.

ఆశిక్.. కాళేశ్వరి స్వస్థలమైన కముత్తులో క్లినిక్ నడుపుతున్నాడు. ఆమె మొదట్లో తన నగ్న వీడియోలను తీసి అతడికి పంపేది. కానీ తర్వాత అతని అభ్యర్థన మేరకు తన హాస్టల్ మేట్స్ సన్నిహిత చిత్రాలు, వీడియోలను పంపడం ప్రారంభించింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఫోన్ నుంచి తొలగించింది.

దీంతో ఎంత కాలం నుంచి ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఆషిక్ ఈ వీడియోలను వేరే వ్యక్తులకు పంపించాడేమో అనే విషయంపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story