మహిళను లైంగికంగా వేధించిన ర్యాపిడో డ్రైవర్.. సస్పెండ్ చేసిన కంపెనీ

మహిళను లైంగికంగా వేధించిన ర్యాపిడో డ్రైవర్.. సస్పెండ్ చేసిన కంపెనీ
బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పేర్కొంది.

బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పేర్కొంది. శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్‌ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా జరిగిన దారుణ ఘటన వివరాలను ఆమె పంచుకున్నారు.

వినియోగదారు తన ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉన్నందున మార్గాన్ని నావిగేట్ చేయడానికి తన ఫోన్‌ని ఉపయోగించడానికి అనుమతించమని డ్రైవర్ ఆమెను కోరినట్లు పేర్కొంది. "మొదట్లో తన ఫోన్ బ్యాటరీ డెడ్ అయిందని, అందుకే నా ఫోన్‌ని ఆ స్టాండ్‌లో ఉంచి మ్యాప్‌లు చూడాలని చెప్పాడు. నేను ఇచ్చాను. తర్వాత అతను నేను ఎక్కడి నుండి వచ్చాను, నా కుటుంబం ఎక్కడ ఉంది మొదలైన వాటి గురించి అడిగాడు. చాలా మంది డ్రైవర్లు కబుర్లు చెబుతారు కాబట్టి నేను కూడా అతడు అడిగిన వాటన్నింటికీ జవాబిచ్చాను," అని ఆమె రెడిఫ్ పోస్ట్‌లో తెలిపారు.

బండిలోపెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ వద్ద ఆగి, వెనుక సీటు క్రింద ఉన్న కీని తీసుకునేందుకు డ్రైవర్ ఆమె తొడలను రెండుసార్లు టచ్ చేశాడు. నేను భయపడిపోయి భయ్యా అని అరిచాను. ఇప్పుడేం జరుగుతుందోనని నేను భయపడ్డాను. అతను ఏం చేస్తున్నాడో కూడా నేను అతనిని అడగలేకపోయాను. మేము రద్దీగా ఉండే ప్రాంతానికి చేరుకునే సరికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. నేను ఎప్పుడు గమ్యాన్ని చేరుకుంటానని, ఆ బాధను ఎలాగైనా భరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వెంటనే అతడిని ఆపి అడగడానికి కానీ, చెప్పుతో కొట్టే ధైర్యం కానీ నాకు లేదు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడని తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

చివరికి మా ఇల్లు వచ్చింది. తాను చాలా కాలంగా ర్యాపిడో ఉపయోగిస్తున్నప్పటికీ తనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పింది. మహిళ రాపిడోలో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ పేర్కొన్నట్లు ఆమె చెప్పింది. "చెత్త విషయం ఏమిటంటే వారు రైడర్‌తో క్రాస్ వెరిఫై చేస్తారని చెప్పారు. తర్వాత, Rapido డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు నాకు తెలియజేశారు అని ఆమె రెడిక్ట్ లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story