నాలుగు రోజుల్లో పెండ్లి.. కరెంట్ షాక్​తో వరుడు మృతి

నాలుగు రోజుల్లో పెండ్లి.. కరెంట్ షాక్​తో వరుడు మృతి

నిర్మల్​ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో నాలుగు రోజుల్లో పెండ్లి కావాల్సిన ఓ యువకుడు కరెంట్​ షాక్​తో చనిపోయాడు. గ్రామానికి చెందిన నీరాల నీలయ్య, కళ దంపతుల కొడుకు వినోద్(25) ఆదివారం ఇంట్లో స్నానం చేసేందుకు నల్లా తిప్పుతుండగా.. గీజర్​ నుంచి నల్లాకు విద్యుత్​ సరఫరా జరిగి షాక్​కు గురయ్యాడు. కుటుంబసభ్యులు వినోద్ ను ఖానాపూర్ దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. వినోద్​కు ధర్మపురికి చెందిన యువతితో వచ్చే ఆదివారం పెండ్లి

జరగాల్సి ఉంది.

ఖమ్మం రూరల్​ మండలంలో కౌలు రైతు ..

ఖమ్మం రూరల్ / కురవి (డోర్నకల్‌‌ ) : ఖమ్మం రూరల్​ మండలంలో కరెంట్​షాక్​తో ఓ కౌలు రైతు చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం..మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ ​మండలం రాముతండాకు చెందిన మాజీ ఉప సర్పంచ్​ లకావత్​ సోమ్లా(60) మండలంలోని మంగళగూడెం రెవెన్యూ పరిధిలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పక్క చేను రైతు మోటార్​ కోసం సోమ్లా వ్యవసాయ భూమి ఫెన్సింగ్​ మీది నుంచి కరెంట్​ తీగలాగాడు. ఆ వైర్​ తెగి ఫెన్సింగ్​ కు కరెంట్​సరఫరా జరిగింది. గమనించని సోమ్లా పొలంలో మోటార్​ అన్​ చేసేందుకు వెళ్లి కంచెను పట్టుకోవడంతో కరెంట్​షాక్​కొట్టి అక్కడిక్కడే చనిపోయాడు.

ఫోన్​ చార్జర్​ తీస్తుండగా యువతి..

గండీడ్ : సెల్ ఫోన్ చార్జర్​ తీస్తుండగా షాక్ కొట్టడంతో నారాయణపేట జిల్లా కొత్తపల్లితండాకు చెందిన పూజ(18) చనిపోయింది. పోలీసుల కథనం ప్రకారం..మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్ మండలం పలుగుతండాలో ఉంటున్న అక్క సోనీ బాయి ఇంటికి వచ్చిన పూజ రాత్రి కరెంట్​బోర్డు నుంచి​ చార్జర్​ తీస్తుండగా షాక్​కు గురై కింద పడిపోయింది. కుటుంబీకులు మహబూబ్​నగర్​ జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు .

Tags

Read MoreRead Less
Next Story