Crime News: ట్యూషన్ మాస్టర్ పాడు బుద్ధి.. 9 ఏళ్ల విద్యార్థినిపై..

Crime News: ట్యూషన్ మాస్టర్ పాడు బుద్ధి.. 9 ఏళ్ల విద్యార్థినిపై..
Crime News: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు.

Crime News: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు. చదువు చెప్పాల్సిన మాస్టారు విద్యార్థిని చేతులతో ఎక్కడెక్కడో తడిమి తన చెత్త బుద్ధిని బహిర్గతపరుచుకున్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఈ సంఘటన ఫిబ్రవరి 17న జరిగింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్‌లో ట్యూషన్ మాస్టర్‌గా పని చేస్తున్న నిందితుడి వద్దకు బాలిక వెళ్లేది. పాఠాలు చెబుతున్న క్రమంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక అతడి చర్యలను అసహ్యించుకుంది. అయినా అతడు తన కోర్కెను తీర్చుకున్నాడు.. తల్లిదండ్రులకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాలికను బెదిరించాడు కీచక ఉపాధ్యాయుడు. దాంతో ఆ అమ్మాయి ఇంటికి వచ్చి మూడీగా ఉంది. ఎవరితో మాట్లాడలేదు.. ట్యూషన్‌కు వెళ్లనని చెప్పింది. బిడ్డ ప్రవర్తనతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పదే పదే ప్రశ్నించగా విషయం చెప్పింది. బాలిక తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని టీచర్‌పై IPC సెక్షన్‌లు 376-AB మరియు 506 కింద "రేప్" మరియు "క్రిమినల్ బెదిరింపు"తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేశారు.

వైద్య పరీక్షల్లో లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి అటునుంచి జైలుకు పంపించారు. (లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి చిత్రాలను బహిర్గతం చేయరాదు)

Tags

Read MoreRead Less
Next Story