రాహుల్ హత్య కేసు : ఎవరీ గాయిత్రి?

రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారి రాహుల్ హత్యకేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక నిందితురాలైన గాయిత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ హత్య కేసు : ఎవరీ గాయిత్రి?
X

రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారి రాహుల్ హత్యకేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక నిందితురాలైన గాయిత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఈ కేసులో పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు ఎయిమ్స్‌లో మెడికల్‌ సీటు ఇప్పించాలని రాహుల్‌కు గాయత్రి రూ.6 కోట్లు ఇచ్చింది. అయితే ఇటు సీటు రాకపోవడం, అటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె రాహుల్ పైన కక్ష పెంచుకున్నారని, దీనితో విజయకుమార్‌, కోగంటి సత్యంలతో కలిసి రాహుల్‌ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES