క్షణికావేశం: భర్త చికెన్ తిన్నాడని భార్య..

అయ్యో తల్లి.. ఆ మాత్రం దానికే ఆత్మహత్య చేసుకున్నావా.. అంత ఆవేశం అయితే ఎలా తల్లీ.. కూతురి శవాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

క్షణికావేశం: భర్త చికెన్ తిన్నాడని భార్య..
X

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం రక్షాబంధన్ రోజున జరిగింది. తల్లి ఇంటి నుండి తిరిగి వచ్చిన మహిళ తన భర్త పొరుగున ఉన్న అత్త ఇంట్లో చికెన్ తినడాన్ని చూసింది. తినొద్దని వారించినా వినలేదు. అది చూసి ఆమె తట్టుకోలేకపోయింది. భర్తతో గొడవపడిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. సగం కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం మెడికల్ కాలేజీలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది.

సూరజ్‌పూర్‌ భట్‌గావ్ ప్రాంతంలోని కరోండ గ్రామానికి చెందిన మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున భర్త రామజన్మతో కలిసి రాఖీ కట్టడానికి తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడి నుండి ఇద్దరూ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంతలో, రామజన్మ పొరుగున నివసిస్తున్న తన అత్త ఇంటికి చేరుకుని అక్కడ చికెన్ వండడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి మనీషా అక్కడికి భర్తని చికెన్ తినొద్దని చెప్పింది. శ్రావణ మాసం అని ఈ ఒక్క నెల చికెన్ మానేయమని చెప్పింది. అయినా అతడు వినకుండా చికెన్ తిన్నాడు.

ఆమె కోపంతో ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత రామజన్మ భార్యకు నచ్చచెప్పేందుకు ఇంటికి వెళ్లాడు. అంతలోనే లోపలి నుంచి అరుపులు వినిపించాయి. ఇరుగు పొరుగు వారు వారు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనీషా మంటల్లో చిక్కుకోవడాన్ని చూసి అందరూ తలో చెయ్యీ వేసి మంటలు ఆపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనీషా మంటల్లో తీవ్రంగా కాలిపోయింది.

మనీషా శ్రావణ మాసంలో పూజలు బాగా చేస్తుంది. వరలక్ష్మీ వ్రతం రోజు ఉపవాసం ఉంది. తానెంతో భక్తితో ఆరాధించే ఈ పవిత్ర మాసంలో భర్త చికెన్ తినడం తట్టుకోలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను భట్గావ్ ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. కానీ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అంబికాపూర్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మనీషా మృతి చెందింది.

Next Story

RELATED STORIES