Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Daily Horoscope

రాశిఫలాలు

Horoscope Today: వివిధ రాశుల వారి దినఫలాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.36| సూర్యాస్తమయం సా.6.34| తిథి శు.ద్వాదశి ప.2.38 వరకు తదుపరి త్రయోదశి గురువారం వరకు|నక్షత్రం జ్యేష్ట సా.05.44 వరకు| తదుపరి మూల|రాహుకాలం :ప. 12.00 నుంచి 01.30 వరకు| యమగండం ఉ.7.30 నుంచి 09.00 వరకు| వర్జ్యం రా.01.09 నుంచి 02.39 వరకు | దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.32 వరకు | అమృతఘడియలు ప.09.25 నుంచి 10.54 వరకు

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తు్న్నాయి. ప్రయాణాలు రద్దు. అనారోగ్యం. ముఖ్య పనుల్లో అవరోధాలు. బందువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అయోమయ పరిస్థితి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో సంభాషణలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో అంచనాలకు తగిన లాభాలు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు.

మిథునరాశి: ఈ రాశి వారికి రాబడి కొంత తగ్గే అవకాశం. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు ముందుకు సాగవు. మిత్రులతో స్వల్ప విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటకరాశి: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు , ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహరాశి: ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో మందగమనం. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలలో స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కన్యారాశి: ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు.

తులారాశి: పరిచయాలు పెరుగుతాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కుటుంబంలో ఒత్తిళ్లు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. బంధువులతో కొన్ని వివాదాలు .ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

ధనుస్సురాశి: ఈ రాశి వారికి పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలలో మరింత జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. అనారోగ్యం.

మకరరాశి: ఈ రాశి వారికి కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్యమైన చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో సత్తా చాటుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత.

కుంభరాశి: ఈ రాశి వారికి పనులు సకాలంలో పూర్తి. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. దైవదర్శనాలు.

మీనరాశి: ఈ రాశి వారికి కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని పనులలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story