Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి

Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి
Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.36| సూర్యాస్తమయం సా.6.34| తిథి శు.త్రయోదశి ప.12.20 వరకు తదుపరి చతుర్థశి శుక్రవారం వరకు|నక్షత్రం మూల ప.04.07 వరకు| తదుపరి పూర్వాషాఢ|రాహుకాలం :ప. 01.30 నుంచి 03.00 వరకు| యమగండం ఉ.06.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.1.11 నుంచి 02.42 వరకు పున: ప. 2.37 నుంచి 4.07 వరకు | దుర్ముహూర్తం ఉ.09.55 నుంచి 10.47 వరకు పున: మ. 3.06 నుంచి 3.58 వరకు | అమృతఘడియలు ప.10.07 నుంచి 11.37 వరకు

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

వృషభ రాశి: ఈ రాశివారు సోదరుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

మిథునరాశి: ఈ రాశివారు సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

కర్కాటకరాశి: ఈ రాశివారి అనుకూలంగా ఉంది. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహరాశి: ఈ రాశివారికి ప్రతి పనిలోనూ ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కన్యారాశి: ఈ రాశివారికి రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

తులారాశి: ఈ రాశివారికి నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

వృశ్చికరాశి: ఈ రాశివారికి పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సురాశి: ఈ రాశివారికి బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

మకరరాశి: ఈ రాశివారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పనులలో విజయం. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభరాశి: ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు,మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.

మీనరాశి: ఈ రాశివారికి వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త నిరాశ కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story