Horoscope Today: ఈరోజు మీ రోజు! ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో తగాదాలు

Horoscope Today: ఈరోజు మీ రోజు! ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో తగాదాలు
Horoscope Today: వివిధ రాశుల వారి ధిన ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.

Horoscope Today: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు. షష్టి తె.04.29 వరకు తదుపరి సప్తమి|నక్షత్రం ఉత్తరాభద్ర ప.02.26 వరకు| తదుపరి రేవతి|రాహుకాలం ప. 1.30 నుంచి 03.00 వరకు| యమగండం ప.6.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.03.23 నుంచి 05.18 వరకు| దుర్ముహూర్తం ఉ.09.55 నుంచి 10.47 వరకు | శుభసమయం ప.12.00 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశి వారికి పనుల్లో అనుకోని జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభరాశి: .కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోబివృద్ధి.

మిథునరాశి: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలయ దర్శనాలు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిని విధంగా ఉంటాయి.

కర్కాటకరాశి: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

సింహరాశి: ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

కన్యారాశి: ఆకస్మిక ధన, వస్తులాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తులారాశి: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు ముందుకు సాగవు.

వృశ్చికరాశి: ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువుల ద్వారా ధనలాభం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

ధనుస్సురాశి: మిత్రులతో అకారణంగా వివాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరరాశి: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనప్రాప్తి. స్థిరాస్తివృద్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభరాశి: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనరాశి: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story