Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు..

Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు..
Horoscope Today: వివిధ రాశుల వారి దిన ఫలాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు. సప్తమి పూర్తి శనివారం ఉ.06.29 వరకు తదుపరి అష్టమి|నక్షత్రం రేవతి సా.04.14 వరకు| తదుపరి అశ్వని|రాహుకాలం ఉ. 10.30 నుంచి 12.00 వరకు| యమగండం ప.3.00 నుంచి 04.30 వరకు| వర్జ్యం లేదు| దుర్ముహూర్తం ఉ.08.12 నుంచి 09.04 వరకు పున: మ. 1.31వరకు | శుభసమయం ఉ.07.00 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఈ రాశి వారికి శుభఫలితాలు ఉన్నాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: ఈ రాశి వారికి.మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: ఈ రాశి వారికి శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బంధువుల కలయిక. ఇంటాబయటా చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: ఈ రాశి వారి పరపతి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య: ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు కలుగుతాయి.

తుల: ఈ రాశి వారికి వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: ఈ రాశి వారు దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: ఈ రాశి వారికి వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: ఈ రాశి వారికి కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: ఈ రాశి వారికి దూరప్రయాణాలు ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: ఈ రాశి వారికి రుణాలు తీరతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు , ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story