Horoscope Today: ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి

Horoscope Today: ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి
Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

శ్రీ ప్లవ నామ సంవత్సరం | దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం| తిథి శు.చతుర్దశి| నక్షత్రం శ్రవణం|సూర్యోదయం : 5.46 | సూర్యాస్తమయం : 6.20| రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు| యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు| వర్జ్యం రా.1.41 నుండి 3.12 వరకు| దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.29 నుండి 1.19 వరకు| అమృతఘడియలు...ప.3.42 నుండి 5.14 వరకు|

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి ఒప్పందాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువుల సలహాలు పాటిస్తారు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: పనుల్లో చికాకులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. చర్చలలో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కొత్త ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

తుల: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

వృశ్చికం: పలుకుబడి మరింత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి.

మకరం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహపూరితంగా ఉంటుంది.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. సోదరులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

మీనం: రావలసిన బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Tags

Read MoreRead Less
Next Story