తిరుమలలో శ్రావణపూర్ణిమ సందర్భంగా స్వామివారికి గరుడసేవ..!

తిరుమలలో శ్రావణపూర్ణిమ సందర్భంగా స్వామివారికి గరుడసేవ..!
తిరుమలలో శ్రావణపూర్ణిమ సందర్భంగా స్వామివారికి గరుడసేవ జరిగింది. కుంభవృష్టి కారణంగా వాహన మండపంలోనే గరుడసేవ నిర్వహించారు

తిరుమలలో శ్రావణపూర్ణిమ సందర్భంగా స్వామివారికి గరుడసేవ జరిగింది. కుంభవృష్టి కారణంగా వాహన మండపంలోనే గరుడసేవ నిర్వహించారు టీటీడీ అధికారులు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు.. గరుత్మంతుని అధిరోహించి వాహన మండపంలోనే స్వామి వారికి దర్శనం ఇచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story