దైవదర్శనం : స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయం... పొట్లపల్లి

దైవదర్శనం : స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయం... పొట్లపల్లి
రెండు దశాబ్దాల క్రితం అదో మామలు గ్రామం... కానీ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఆ ఊళ్లో ఇప్పుడు ఏ మూలన తవ్వినా ఓ అపురూప శిల్పం బయటపడుతూనే ఉంది.

రెండు దశాబ్దాల క్రితం అదో మామలు గ్రామం... కానీ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఆ ఊళ్లో ఇప్పుడు ఏ మూలన తవ్వినా ఓ అపురూప శిల్పం బయటపడుతూనే ఉంది. ఆ గ్రామమే పొట్లపల్లి.. తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ మండలానికి చెందిన ఈ పొట్లపల్లి ఇప్పుడు శివానమాస్మరణతో మారుమ్రోగుతుంది. ఆ ఆలయ విశేషాలే ఈనాటి మన దైవదర్శనం.. !

* చరిత్ర ప్రకారం ఒకప్పటి నాగపట్టణమే ఈనాటి పొట్లపల్లి అని చెబుతుంటారు.

* 1996 ఆగస్టులో పొట్లపల్లి గ్రామానికి చెందిన పోచయ్య అనే ఓ వ్యక్తి తన ఇంటి ప్రహరీ గోడ నిర్మించేందుకు పునాది తీస్తుండగా... అప్పుడు కాకతీయుల కాలం నాటి శివలింగం ఒకటి బయటపడింది.. అందుకే స్వామిని ఇక్కడ స్వయంభూ రాజరాజేశ్వర అని పిలుస్తుంటారు.

* అలా బయటపడ్డ శివలింగానికి ముందుగా ఇక్కడి అతిపురాతనమైన మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిష్టించారు. లింగం దొరికిన స్థలంలో మాత్రం ఓ చిన్న శివలింగాన్ని ప్రతిష్టించి పూజిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వామి వారిని చూసేందుకు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో.. రేణుక నది తీరాన మరో పెద్ద ఆలయాన్ని నిర్మించారు.


* ఇక్కడ స్వామి వారు శ్రీశైల క్షేత్రంలో మాదిరిగా అర్ధనారీశ్వరుని రూపాన్ని పోలి ఉంటాడు. అందుకే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని అంటారు.

* ఈ ఆలయంలో స్వామివారికి ఇరువైపులా తండ్రికి కాపలా ఉన్నట్టుగా విఘ్నేశ్వరుడు ఒకవైపునా, కుమారస్వామి మరోవైపున కొలువై ఉన్నారు.

* స్వామి వారికి పూజలు, లింగార్చనకలు, దూపదీప నైవేద్యాలు నిత్యం జరుగుతుంటాయి. భక్తులు స్వయంగా శివలింగానికి అర్చనలు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది.

* స్వామి వారి పక్కనే అమ్మవారు (పార్వతీదేవి) కూడా వెలసి ఉన్నారు. తనని కొలిచినవారి కోరికలు తీరుస్తూ.. వారి కొంగుబంగారమై నిలుస్తుంది అమ్మవారు. అమ్మవారి చిన్న విగ్రహానికి నిత్యం కుంకుమ పూజ జరుగుతుంటుంది.



* ఈ గ్రామంలో 101 శివాలయాలు నిర్మించారని, వాటిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ లింగాన్ని పోలిన లింగాలే ఉండేవని చరిత్రకారులు అంటున్నారు.

* పొట్లపల్లి నుంచి పందిల్ల వరకు ప్రతి శివరాత్రికి తాటాకుల పందిళ్లు వేసి ఉత్సవాలు నిర్వహించేవారు. ఇందువల్లే పందిల్ల గ్రామానికి ఆ పేరొచ్చింది. కాకతీయుల పరిపాలనకు తెరపడడంతో ఇక్కడి ఆలయాలను భూస్థాపితం చేశారనే వాదనలు కూడా ఉన్నాయి.

* ఇక్కడ కార్తీకమాసంలో చాలా పూజలు జరుగుతాయి. ఇక మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story