భక్తి

కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లింలు

సేవించే మనసుండాలె కానీ రాముడైతేనేమి.. రహీం అయితేనేమి.. అందరి దేవుళ్లు ఒక్కటేనన్న అభిమతం ఉండాలంటూ కనువిప్పు కలిగిస్తున్నారు కడప ముస్లింలు.

కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లింలు
X

సేవించే మనసుండాలె కానీ రాముడైతేనేమి.. రహీం అయితేనేమి.. అందరి దేవుళ్లు ఒక్కటేనన్న అభిమతం ఉండాలంటూ కనువిప్పు కలిగిస్తున్నారు కడప ముస్లింలు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తిరుమల తొలిగడప.. దేవుని కడపలోని లక్ష్మీ వెంటేశ్వర స్వామి ఆలయం ముస్లిం భక్తులతో పోటెత్తింది. బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి.. ఉగాది పర్వదినాన వెంకన్నను దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని మహమ్మదీయుల నమ్మకం. ఉదయాన్నే ఆలయానికి చేరకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ ఇంటి ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మకు భత్యాన్ని సమర్పించుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నామంటున్నారు.

Next Story

RELATED STORIES