Navratri: నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారిని ఎలా పూజించాలంటే..

Navratri: నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారిని ఎలా పూజించాలంటే..
Navratri:తెలుగువారు వైభవంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది దసరా. ఇది ఒక్కరోజు వేడుక కాదు.

Navratri:తెలుగువారు వైభవంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది దసరా. ఇది ఒక్కరోజు వేడుక కాదు. తొమ్మిది రాత్రులు.. ఒక్కొక్క రాత్రి అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని కొలిచే వేడుక. వీటినే నవరాత్రులు అంటాం. ఇందులో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 7న ప్రారంభమయ్యి 15న ముగియనున్నాయి. ఇక నవరాత్రుల్లో మొదటిరోజే మహా బతుకమ్మ వేడుకలు కూడా మొదలవుతాయి.

బతుకమ్మలను మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. ఆరోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. బతుకమ్మను పేర్చడం, దాని చుట్టూ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ తిరగడం ఇదే రోజు ప్రారంభమవుతుంది. మొదటిరోజు బతుకమ్మను ఎంగిలి పువ్వుతో పేరుస్తారు.

అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో కొలువుదీరే క్రమంలో మొదటి రోజున రెండేళ్ల చిన్నారిగా పూజిస్తారు. అంటే మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది. పాడ్యమి రోజు ఈ అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. పొంగల్‌‌ను నైవేద్యంగా పెడతారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే.. శత్రువు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. పూజ చేసేముందు కచ్చితంగా అఖండ దీపం వెలిగించుకోవాలి. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story