ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..టీటీడీ చరిత్రలోనే మొదటి సారి

ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..టీటీడీ చరిత్రలోనే మొదటి సారి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహనంతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 23న గరుడసేవ జరగనుంది.

కోవిడ్ కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారిగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న చక్రస్నానంతో ముగుస్తాయి. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం గరుడ వాహనసేవ అనంతరం తిరుమలలో కర్ణాటక సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు శంకుస్థాపనకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story