Bigg Boss : బిగ్ బాస్ హోస్ట్ నుండి నాగార్జున ఔట్!

Bigg Boss : బిగ్ బాస్ హోస్ట్ నుండి నాగార్జున ఔట్!

బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిందో లేదో అప్పుడే ఎనిమిదో సీజన్ పై చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు హోస్ట్ విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు హోస్ట్ గా చేస్తూ వచ్చారు నాగార్జున. బిగ్ బాస్ మొదలవుతుంది అంటే చాలు.. హోస్ట్ విషయంలో వార్తలు వస్తుండడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎనిమిదో సీజన్ ముందు కూడా అదే చర్చ మొదలైంది.

అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ హోస్ట్ ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చేయడం కుదరని నాగార్జున ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా చేయకూడదని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకు కూడా తెలిపారట. దీంతో కొత్త హోస్ట్ కోసం వెతికే పనిలో పడ్డారట నిర్వహకులు. రానా, విజయ్ లాంటి స్టార్స్ లను పరిశీలిస్తున్నారట. వెంకటేష్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.

సో మొత్తానికి ఎనిమిదో సీజన్ లో కొత్త హోస్ట్ ను చూడబోతున్నాం అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్ గా చేశారు. మరి వీరిని బీట్ చేసే రేంజ్ లో ఎవరు హౌజ్ ని హోస్ట్ చేస్తారో చూడాలి. ఇక ఈ సారి ఇంటి సభ్యులలో కూడా చాలా మార్పులు ఉంటాయని సమాచారం.

ఇక ఇటీవల నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగార్జున. బిన్నీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయింది. నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. మళయాళ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ రూ. 50కోట్లు వసూలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story