విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా.. అయితే ఈ 4 విషయాలు

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా.. అయితే ఈ 4 విషయాలు
విటమిన్ డి మీ ఎముకలకు చాలా కీలకం. దీని వినియోగం వలన పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విటమిన్ డి మీ ఎముకల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇతర విటమిన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని ఆహారాలలో సహజంగా విటమిన్ డి ఉంటుంది. కానీ అన్నిటికంటే ఉత్తమమైనది, ఉచితంగా లభించేది సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు విటమిన్ డిని అందిస్తాయి. సూర్యరశ్మికి గురైనప్పుడు, మీ శరీరం విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది.

కాబట్టి, దీనిని 'సన్‌షైన్' విటమిన్ అని కూడా అంటారు. సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, విటమిన్ డి లోపం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా భారతీయులలో విటమిన్ డి లోపం ఎక్కువ. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి డాక్టర్లు సప్లిమెంట్లను సూచిచడం సర్వ సాధారణం. మీరు కూడా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి.

విటమిన్ డి సప్లిమెంట్ల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

1. ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి

ఎముకల నొప్పి, అలసట, తరచుగా ఇన్‌ఫెక్షన్‌లు, డిప్రెషన్‌, గాయాలు నెమ్మదిగా మానడం, కండరాల నొప్పి విటమిన్ డి లోపం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు. మీరు ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే, ముందుగా మీ విటమిన్ డి స్థాయిలను చెక్ చేసుకోండి. స్థాయిలు తక్కువగా ఉంటే, మీకు సరైన మోతాదును సూచించేందుకు మీ వైద్యుడిని సంప్రదించండి.

2. సప్లిమెంట్లపై పూర్తిగా ఆధారపడవద్దు

విటమిన్ డి యొక్క సహజ వనరులను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. చేపలు, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొన, ఎర్ర మాంసం విటమిన్ డి యొక్క మంచి మూలాలు. అలాగే, ఉదయాన్నే సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు ఉండడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

3. ఎక్కువ రోజులు తీసుకుంటే

మీరు ఎక్కువ కాలం పాటు విటమిన్ D తీసుకుంటే అది విషంగా మారుతుంది. ఫలితంగా వాంతులు, నిరాశ, కడుపు నొప్పి, అధిక రక్తపోటు, మగత, గందరగోళం, మలబద్ధకానికి దారితీస్తుంది. పైన చెప్పినట్లుగా, ఏదైనా సప్లిమెంట్లను తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

4. ఇతర విటమిన్లపై కూడా దృష్టి పెట్టండి

విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. మెగ్నీషియంతో పాటు తగినంత విటమిన్ ఎ, కె జోడించడం వల్ల ఇది మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. ఈ మూడు పోషకాలు మెరుగైన శోషణకు, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

విటమిన్ డి ఎందుకు ముఖ్యమైనది?

విటమిన్ డి మీ ఎముకలకు చాలా కీలకం. ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డి మీ ఎముకలకు కూడా మంచిది. శారీరక బలాన్ని అందిస్తుంది.

ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ డి మీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. డిప్రెషన్ లక్షణాలను నిర్వహించడంలో సహాయపడుతుంది.సహజంగా లభించే విటమిన్ డిని క్యాప్సిల్స్ రూపంలో తీసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం అవసరమా ఆలోచించండి..


Tags

Read MoreRead Less
Next Story