Natural Home Remedies: గొంతులో కఫాన్ని తగ్గించే సహజపద్ధతులు..

Natural Home Remedies: గొంతులో కఫాన్ని తగ్గించే సహజపద్ధతులు..
Natural Home Remedies: ఇది అలెర్జీ ప్రతిచర్యకు ప్రతిస్పందనగా పాల ఉత్పత్తులను తినడం లేదా త్రాగిన తర్వాత ఈ కఫ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.

Natural Home Remedies: అసలే శీతాకాలం.. ఆపై కరోనా భయం.. వెరసి అందరికీ దగ్గులు, జలుబులు.. గొంతులో గరగరలు. ఎన్ని మందులు వాడినా ఇంటి వైద్యం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటున్నారు నేచురోపతి వైద్యులు.

శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్‌లు రాకుండా శ్లేష్మం ఒక రక్షిత పాత్రను పోషిస్తుంది. కానీ కొన్నిసార్లు అది మందంగా మారుతుంది. ఇది అలెర్జీ ప్రతిచర్యకు ప్రతిస్పందనగా పాల ఉత్పత్తులను తినడం లేదా త్రాగిన తర్వాత ఈ కఫ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.

గొంతులో కఫాన్ని క్లియర్ చేసే 5 సహజ నివారణ పద్ధతులు..

1. అల్లం మరియు తేనె

అల్లం మొండి శ్లేష్మాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. గొంతు నొప్పి, కఫంతో బాధపడుతుంటే

2 టేబుల్‌స్పూన్‌ల తేనెను వేడి చేయాలి. అయితే తేనెను వేడిచేసేటప్పుటు 40°C మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉంటే, తేనె దాని చికిత్సా ప్రభావాన్ని కోల్పోతుంది. ఈ వేడి చేసిన తేనెకు ఒక టీస్పూన్ తురిమిన అల్లం జోడించండి. మూడు రోజులు రోజుకు రెండు టేబుల్ స్పూన్లు తీసువాలి. చాలా వరకు ఉపశమనం ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యుని సంప్రదించాలి.

2. ఉప్పు నీటితో పుక్కిలించడం

1 టేబుల్ స్పూన్ ఉప్పును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు పుక్కిలించాలి. పుక్కిలించడం వల్ల మీ గొంతు చాలా మెరుగ్గా ఉంటుంది.

3. పసుపు

పసుపు నిజమైన సూపర్ ఫుడ్. ఇది నొప్పిని, మంటను తగ్గిస్తుంది. ఒక గ్లాసు వేడి పాలలో పావు టీస్పూన్ నల్ల మిరియాలపొడి, అర టీ స్పూన్ పసుపు, ఒక టీస్పూన్ తేనె కలపండి. శ్లేష్మం క్లియర్ అయ్యే వరకు మీరు ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని త్రాగవచ్చు.

4. వేడి పానీయాలు

హెర్బల్ టీ కూడా కఫాన్ని దూరం చేస్తుంది. పుదీనా, తులసి, సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, బిరియానీ ఆకు అన్నీ వేసి నీళ్లు మరగబెట్టి సగం అయిన తరువాత దించి వడకట్టాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.

5. ఆవిరి పట్టడం

బాగా మరిగించిన నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరిని పీల్చడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఈ నూనె కొన్ని చుక్కలను కర్చీఫ్‌పై ఉంచి పీలిస్తే కూడా రిలీఫ్‌గా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story