Thyroid: 5 సూపర్ ఫుడ్స్‌తో ధైరాయిడ్ కంట్రోల్

Thyroid: 5 సూపర్ ఫుడ్స్‌తో ధైరాయిడ్ కంట్రోల్
Thyroid: మెడ యొక్క అడుగు భాగంలో ఉంటుంది. మనిషి మొత్తం ఆరోగ్యంపై ఈ గ్రంధి ప్రభావం చూపిస్తుంది.

Thyroid: ఈ మధ్యకాలంలో థైరాయిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జీవనశైలి, తీసుకునే ఆహారం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పోషకాహార లోపి, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా, చాలా మంది వ్యక్తులు చాలా చిన్న వయస్సులోనే థైరాయిడ్‌ బారిన పడుతున్నారు. మీ జీవనశైలి, తీసుకునే ఆహారం ద్వారా థైరాయిడ్‌ తీవ్రతను అరికట్టవచ్చు.

థైరాయిడ్ శరీరం యొక్క జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఇది బటర్‌ప్లై ఆకారంలో ఉన్న ఒక గ్రంధి. ఇది మెడ యొక్క అడుగు భాగంలో ఉంటుంది. మనిషి మొత్తం ఆరోగ్యంపై ఈ గ్రంధి ప్రభావం చూపిస్తుంది.

ఆయుర్వేద వైద్యులు డాక్టర్ దీక్షా భావ్‌సర్ సావలియా.. థైరాయిడ్ (హైపో, హైపర్) ఏది వచ్చినా దాని తీవ్రతను తగ్గించుకునేందుకు 5 సూపర్‌ఫుడ్‌లు అద్భుతంగా పనిచేస్తాయని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

ఉసిరి



ఉసిరికాయలో నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, వ్యాధులతో పోరాడడంలోనూ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

కొబ్బరి



పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనె థైరాయిడ్ రోగులకు ఉత్తమ ఆహారం. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరాయిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

గుమ్మడి గింజలుః



గుమ్మడి గింజలు జింక్ యొక్క గొప్ప మూలం. ఇది శరీరంలోని విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.

బ్రెజిల్ నట్స్



"సెలీనియం అనేది థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియకు శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. బ్రెజిల్ గింజలు ఈ పోషకం యొక్క ఉత్తమ సహజ వనరులలో ఒకటి. రోజుకు మూడు బ్రెజిల్ గింజలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

పెసలు



పెసల్లో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు & విటమిన్లు & మినరల్స్ అధికంగా ఉన్నాయని తెలిపారు. "ఇంకా వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ అసమతుల్యత కారణంగా మలబద్ధకంతో బాధపడుతుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయోడిన్‌ను అందిస్తుంది. జీర్ణం చేసుకోవడం చాలా తేలిక కాబట్టి వీటిని థైరాయిడ్-ఫ్రెండ్లీ డైట్‌ అంటారు.

Tags

Read MoreRead Less
Next Story