Buttermilk: ఎండాకాలంలో ఓ గ్లాస్ కూల్ బటర్ మిల్క్.. మజ్జిగలో మరిన్ని వెరైటీలు..

Buttermilk: ఎండాకాలంలో ఓ గ్లాస్ కూల్ బటర్ మిల్క్.. మజ్జిగలో మరిన్ని వెరైటీలు..
Buttermilk: మజ్జిగలో ప్రోబయోటిక్‌ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వ్యాధులను దూరం చేయడంలో, పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Buttermilk: వేసవిలో డీహైడ్రేషన్ సర్వసాధారణం. అందుకే రోజంతా తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. మధ్య మధ్యలో మజ్జిగ లాంటివి కూడా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. పేగుల ఆరోగ్యానికి కూడా మంచిది.

మజ్జిగలో ప్రోబయోటిక్‌ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వ్యాధులను దూరం చేయడంలో, పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో కొవ్వు మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. పాలు, పెరుగు కంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఈ మజ్జిగకు సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను కూడా జోడించవచ్చు.

పుదీనా మజ్జిగ

పుదీనా మజ్జిగ జీర్ణక్రియలో సహాయపడుతుంది. డిటాక్సింగ్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది. పుదీనా కడుపు నొప్పి, అజీర్ణాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది వికారం, తలనొప్పిని దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది.

కావలసినవి

1 కప్పు పెరుగు

¼ స్పూన్ నల్ల మిరియాల పొడి

¼ స్పూన్ ఉప్పు

2 కప్పుల చల్లని నీరు

1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు

అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి సర్వ్ చేయండి.

బీట్‌రూట్ మజ్జిగ

బీట్‌రూట్ మజ్జిగ ఇది శక్తిని పెంచుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

కావలసినవి

½ కప్ సాదా పెరుగు

2 కప్పుల నీరు

రుచికి ఉప్పు

1/4 కప్పు తరిగిన బీట్‌రూట్

1 పచ్చిమిర్చి

½ tsp తరిగిన అల్లం

కొద్దిగ కొత్తిమీర ఆకులు

కొద్దిగ పుదీనా ఆకులు

బీట్‌రూట్‌ను చెక్కు తీసి ముక్కలుగా చేసి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా ఆకులతో కలిపి రుబ్బుకోవాలి. వెడల్పాటి గిన్నెలో పెరుగు బాగా గిలక్కొట్టి అందులో నీళ్లు, ఉప్పు, బీట్‌రూట్ పేస్ట్ వేసి బాగా కలపాలి.

జీలకర్ర మజ్జిగ

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కావలసినవి

1 కప్పు పెరుగు

¼ టీస్పూన్ ఇంగువ

1 స్పూన్ ఉప్పు

2 కప్పుల చల్లని నీరు

1 tsp కాల్చిన జీలకర్ర పొడి

1 స్పూన్ కొత్తిమీర ఆకులు

అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి సర్వ్ చేయాలి.

బార్లీ మజ్జిగ

కావలసినవి

2 టేబుల్ స్పూన్లు బార్లీ పౌడర్

1 ½ కప్పు నీరు

1 కప్పు పెరుగు

1 స్పూన్ అల్లం రసం

½ tsp కాల్చిన జీలకర్ర పొడి

¼ స్పూన్ తాజా నల్ల మిరియాలు పొడి

1 tsp చాట్ మసాలా

అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

మసాలా మజ్జిగ

ఈ మసాలా మజ్జిగ గొప్ప వేసవి కూలింగ్ ఏజెంట్. ఇది వేసవి కాలంలో వేడిని అధిగమించడానికి సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది.

కావలసినవి

½ కప్ సాదా పెరుగు

2 కప్పుల నీరు

ఉప్పు రుచికి సరిపడినంత

1 పచ్చిమిర్చి

½ tsp తరిగిన అల్లం

4 కొత్తిమీర కాడలు

కొన్ని కరివేపాకు ఆకులు

పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకులను గ్రైండ్ చేయాలి. గిన్నెలో పెరుగు బాగా గిలకొట్టి, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి బాగా కలపాలి. కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేయాలి.

ఈ మజ్జిగ వెరైటీలు శరీరానికి శక్తిని, వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఫ్రిజ్ లోని వాటర్ తో కానీ లేదా స్వచ్ఛమైన, సహజసిద్దమైన కుండలోని నీళ్లతో కానీ మజ్జిగ చేసుకుని తాగితే వేసవి తాపం దూరమవుతుంది. ఆరోగ్యంగానూ ఉంటుంది.


Tags

Read MoreRead Less
Next Story