Belly Fat Exercise: పెరిగిన పొట్టను తగ్గించే వ్యాయామం.. ఇంట్లోనే ఇలా చేస్తే..

Belly Fat Exercise: పెరిగిన పొట్టను తగ్గించే వ్యాయామం.. ఇంట్లోనే ఇలా చేస్తే..
Belly Fat Exercise: బెల్లీ ఫ్యాట్ అత్యంత అనారోగ్యకరమైన కొవ్వు. దీన్ని తగ్గించుకోకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు చుట్టుముడతాయి.

Belly Fat Exercise: కొంత మందికి పొట్ట దగ్గర అత్యంత అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుని ఉంటుంది. దీన్ని తగ్గించుకోకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు చుట్టుముడతాయి.

అందుకే బాన పొట్టతో బాధపడేవారు తప్పనిసరిగా జీవనశైలిని మార్చుకుని వ్యాయామం ప్రారంభించాలి. బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడానికి సహాయపడతుంది ఈ వ్యాయామం.

ఫిట్‌నెస్ & న్యూట్రిషన్‌లో ISSA సర్టిఫైడ్ స్పెషలిస్ట్ బిస్వాస్ పొట్ట తగ్గించేందుకు కొన్ని వ్యాయామాలు సూచించారు. వాటిలో ఒకటి..

బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇంట్లోనే ఈ ఎక్సర్‌సైజ్ ఈజీగా చేసుకోవచ్చు. వ్యాయామం మొదలు పెట్టడం ఇదే తొలిసారి అయితే ముందు నిదానంగా తక్కువ సార్లు చేయాలి. ఆ తరువాత ఇబ్బందిగా లేదు అని అనిపించినప్పుడు సంఖ్యను పెంచుకోవచ్చు.

మొదట 10 సెకన్లు విశ్రాంతిగా యోగా మ్యాట్‌పైన శవాసనంలో పడుకోవాలి. మీ కండరాలు వేడెక్కిన తర్వాత వ్యాయామం ప్రారంభించాలి.

1. లెగ్ రైజెస్

ఎలా చెయ్యాలి

యోగా మ్యాట్ మీద వెల్లకిలా పడుకోవాలి. మీ బొటనవేళ్లను మీ థైస్ కింద ఉంచాలి. అరచేతులు నేలపై చదునుగా ఉంచాలి. గాలి తీసుకుంటూ రెండు కాళ్లను ఒకేసారి పైకి లేపాలి. గాలి వదులుతూ నిదానంగా కాళ్లను క్రిందికి దించాలి. శ్వాస మీద కూడా ధ్యాస ఉంచుతూ వ్యాయామం చేయాలి.

మీ పాదాలను నేల నుండి కొద్దిగా ఎత్తి నిదానంగా మీ రెండు కాళ్ళను 90 డిగ్రీలకు తీసుకురావాలి. మళ్లీ నెమ్మదిగా వాటిని క్రిందికి దించాలి. అయితే ఇలా కాళ్లను క్రిందికి దించే ముందు వాటిని పూర్తిగా నేలకు తాకనివ్వకుండా మీ కాళ్లను మళ్లీ పైకి లేపాలి. ఇలా 15 సార్లు 3 సెట్లు చేయాలి.

ఇలా చేయకూడదు - మీ పాదాలను పూర్తిగా నేలపై ఉంచవద్దు లేదా మీ కాళ్లను ఎత్తడానికి మీ చేతులతో మీ థైస్‌ని పైకి నెట్టవద్దు.

Tags

Read MoreRead Less
Next Story