Omicron: ఒమిక్రాన్ గురించి వర్రీ వద్దు.. బూస్టర్ డోస్‌తో చెక్..: వైరాలజీ నిపుణుడు

Omicron: ఒమిక్రాన్ గురించి వర్రీ వద్దు.. బూస్టర్ డోస్‌తో చెక్..: వైరాలజీ నిపుణుడు
Omicron: బూస్టర్ డోస్‌తో కొత్త వేరియంట్‌ను అడ్డుకోవచ్చంటున్నారు.

Omicron: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది కదా అనుకుంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చి ఒంట్లో ఒణుకు పుట్టిస్తోంది. కానీ దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ వైరాలజీ నిపుణుడు, భారత వైద్య పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ డా.టి.జాకబ్ జాన్. బూస్టర్ డోస్‌తో కొత్త వేరియంట్‌ను అడ్డుకోవచ్చంటున్నారు. కోవిడ్ సాధారణ వ్యాధిగా మారడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో మూడో ఉద్ధృతి సంభవించే అవకాశం లేదు. అయితే టీకా తీసుకున్న వారికి కూడా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. కొత్త వేరియంట్ తలెత్తినప్పుడు సహజంగానే ఇలా జరుగుతుంది. ఇప్పటికే భారతీయుల్లో చాలా మందికి రోగనిరోధక శక్తి వచ్చింది.

ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలతో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఉత్పరివర్తనాలు ఎక్కువే. కొత్త వేరియంట్‌లో 34 మ్యూటేషన్లు కనిపించాయి. దీని వల్ల భారీ ముప్పు ఉండకపోవచ్చు. టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసులు కూడా అందించాలి.

చిన్నారులకు కూడా మొదటి డోసు అందించాలి. ఇక మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలి. రెండోసారి గర్భం దాల్చిన వారికి బూస్టర్ డోసు అందించాలి అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తిలో దీనికి సంబంధించిన లక్షణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story