పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. ప్రారంభ సంకేతాలు

పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. ప్రారంభ సంకేతాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎల్లప్పుడూ ప్రారంభ దశలో తన లక్షణాలను బయటపెట్టదు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎల్లప్పుడూ ప్రారంభ దశలో తన లక్షణాలను బయటపెట్టదు. అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను గమనించమని చెబుతున్నారు. అయితే అవి కొన్ని ఇతర అనారోగ్యాలను కూడా సూచిస్తాయి. గణాంకాల ప్రకారం, స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ధూమపానం చేస్తారు, అందుకే పురుషులే ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కు గురవుతుంటారు. పురుషులలో ఈ క్యాన్సర్ యొక్క కొన్ని ప్రారంభ లక్షణాలను తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

ప్రపంచవ్యాప్తంగా వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఒకటి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ జర్నల్స్ ప్రకారం, ప్రపంచ జనాభాలో 18 శాతానికి పైగా ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించిన కొత్త కేసులు ప్రతి సంవత్సరం 2.2 మిలియన్లకు పైగా వస్తున్నాయి.

ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, సిగరెట్ తాగడం స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది, అందువల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.

మీ శరీర కణాలు వాటి సాధారణ పనితీరులో భాగంగా కణజాల కణితులను సృష్టించడం వల్ల మీ అవయవాలు సరిగ్గా పని చేయకుండా ఉంటాయి అని నిపుణులు అంటున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభంలో బ్రోన్కియోల్స్ లేదా చిన్న గాలి సంచులు అని పిలువబడే వాయుమార్గాలలో ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచి ఇతర అవయవాలకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగానే, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా దశల వారీగా పెరుగుతుంది.

నిరంతర దగ్గు

జలుబు లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గు రావడం సాధారణం, కానీ అది ఒక వారం కంటే ఎక్కువ కాలం పాటు ఉంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం కావచ్చు. అలాగే, మీరు ధూమపానం చేస్తే దీర్ఘకాలిక దగ్గులో ఏవైనా మార్పులకు శ్రద్ధ వహించండి.

ఎక్కువ దగ్గు ఉంటే

మీ దగ్గు లోతుగా ఉంటే

మీ దగ్గు బొంగురుగా ఉంటే

మీ దగ్గు రక్తాన్ని ఉత్పత్తి చేస్తే

మీ దగ్గు పెద్ద మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి చేస్తే

ఊపిరి ఆడకపోవడం లేదా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తితే

ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణాలలో శ్వాసలో గురక కూడా ఒకటి. ఊపిరితిత్తుల క్యాన్సర్ వాయుమార్గాన్ని అడ్డుకుంటే శ్వాసలో మార్పులు సంభవిస్తాయి.

మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు వచ్చే శబ్దం విజిల్ శబ్దం మాదిరిగా ఉంటుంది.

వొళ్ళు నొప్పులు

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీ, భుజాలు లేదా వెనుక భాగంలో నొప్పిని కలిగిస్తుంది. ఇది రోజంతా లేదా చాలా తరచుగా జరుగుతుంది. ఈ నొప్పి ఒక్కోసారి స్థిరంగా ఉంటుంది లేదా అడపాదడపా కూడా వస్తుంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీ నొప్పికి కారణమైనప్పుడు అసౌకర్యం ఏర్పడుతుంది.

మీ ఎముకలకు వ్యాపించిన ఊపిరితిత్తుల క్యాన్సర్ మీ వెనుక లేదా మీ శరీరంలోని ఇతర ప్రాంతాల్లో నొప్పిని కలిగిస్తుంది.

గొంతు బొంగురు పోతుంది.

మీ స్వరంలో అకస్మాత్తుగా మార్పు గమనించినట్లయితే, తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది దగ్గు జలుబు కారణంగా కూడా కావచ్చు. అయితే ఇది ఎక్కువ రోజులు కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

బరువు తగ్గడం

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు బరువు తగ్గడం లేదా ఎక్కువ బరువును కలిగిస్తుంది.

మీ బరువులో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే దానిని తేలికగా తీసుకోవద్దు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: వ్యాసంలో పేర్కొన్న సూచనలు మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే.. వైద్యుల సలహాకు ఇది ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.

Tags

Read MoreRead Less
Next Story