Curry Leaves: కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు పడేయరు..

Curry Leaves: కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు పడేయరు..
Curry Leaves: కరివేపాకు లేకుండా తాళింపు ఎలా పెడతారు.. కూరల్లో వచ్చిన కరివేపాకును పక్కన పెట్టినా అది లేకుండా మాత్రం అసలు వంట సాధ్యం కాదు..

Curry Leaves: కరివేపాకు లేకుండా తాళింపు ఎలా పెడతారు.. కూరల్లో వచ్చిన కరివేపాకును పక్కన పెట్టినా అది లేకుండా మాత్రం అసలు వంట సాధ్యం కాదు.. తాళింపులో కరివేపాకు పడితేనే ఘుమఘుమలాడే వాసన ముక్కు పుటాలను తాకుతుంది. కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే పక్కన పడేయరు. బరువు తగ్గించడంలో కూడా కరివేపాకు ప్రముఖ పాత్ర వహిస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు.

ఈ ఆకుల్లో విటమిన్ A, B, C, B2 సమృద్ధిగా ఉంటాయి.

కరివేపాకులోని కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

1. బరువు తగ్గడం



ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.. కరివేపాకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్థాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కరివేపాకులను తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

2. మలబద్ధకాన్ని నివారిస్తుంది.



ఎండు కరివేపాకులను పొడి చేసి మజ్జిగలో కలుపుకుని తాగితే అతిసారం, మలబద్ధకం నివారించబడతాయి. ఖాళీ కడుపుతో తాగితే మరింత ప్రభావంతంగా పని చేస్తుంది. లేత కరివేపాకులను కూడా ఖాళీ కడుపుతో తినవచ్చు. కరివేపాకు ఆకులు ప్రేగుల కదలికకు తోడ్పడతాయి. జీర్ణక్రియకు సహకరించే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి.

3. వికారం నుండి ఉపశమనం

గర్భం దాల్చిన స్త్రీలకు మొదటి మూడు నెలలు వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. వాటి నుండి ఉపశమనం పొందడానికి కరివేపాకులు తోడ్పడతాయి. లేత కరివేపాకు రెబ్బలను జీలకర్రతో కలిపి తింటే వికారం తగ్గుతుంది.

4. బ్యాక్టీరియాను తొలగిస్తుంది

కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సమ్మేళనాలు. ఈ సమ్మేళనాలు కరివేపాకుకు సువాసనను అందిస్తాయి. వీటికి బ్యాక్టీరియాను చంపే లక్షణం ఉంది. ఇవి శరీరం నుండి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

5. మధుమేహ వ్యాధిగ్రస్తులకు

కరివేపాకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ కణాలకు రక్షణ కల్పిస్తాయి మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. కరివేపాకులో ఉండే రాగి , ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఇందుకు సహకరిస్తాయి.

6. కంటి చూపుకు



కరివేపాకు కంటి చూపుపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. కంటిశుక్లాలు త్వరగా రాకుండా చేస్తుంది. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

8. గాయాలు, కాలిన గాయాలకు



తాజా కరివేపాకును మెత్తగా పేస్ట్‌గా చేసి కాలిన గాయాలు, గాయాలపైన నేరుగా పూసి కట్టుకడితే గాయాలు త్వరగా నయం అవుతాయి. కరివేపాకులోని కార్బజోల్ ఆల్కలాయిడ్ సమ్మేళనం గాయాలను నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

9. జుట్టు పెరుగుదల




కరివేపాకు జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది. వెంట్రుక పెరుగుదలకు కారణమవుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చుండ్రుతో బాధపడుతున్నప్పుడు లేత కరివేపాకులను మెత్తని పేస్ట్ చేసి అందులో పెరుగు కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

10. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

కరివేపాకులు జ్ఞాపకశక్తిపై ప్రయోజనకరమైన ప్రభావం చూపిస్తుంది. రోజూ ఓ గుప్పెడు తాజా కరివేపాకులను మజ్జిగలో వేసి మిక్స్ చేసి తాగితే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

Tags

Read MoreRead Less
Next Story