Goat Milk: మేక పాలు లీటర్ @ రూ.400.. డెంగ్యూ ఫీవర్‌ని తగ్గిస్తాయని..

Goat Milk: మేక పాలు లీటర్ @ రూ.400.. డెంగ్యూ ఫీవర్‌ని తగ్గిస్తాయని..
Goat Milk: ఆవు పాలు, గేదె పాల గురించి చాలా మందికి తెలుస్తుంది కానీ మేకపాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

Goat Milk: మంచి పాలను ఎంచుకోవడం దాదాపు కష్టమైపోతుంది. ఆవు పాలు, గేదె పాల గురించి చాలా మందికి తెలుస్తుంది కానీ మేకపాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇందులో ఉన్న పోషకాల గురించి అసలే తెలియదు. సండే వస్తే మార్కెట్‌కి మటన్ తీసుకు వస్తుంటారు కానీ మేక పాలు, మేకపాలల్లో ఉన్న పోషకాలు మన దేశం వారికంటే అమెరికా వారికే బాగా తెలుసేమో.. అందుకే అమెరికన్లు మేకపాలను ఎక్కువగా తాగేస్తుంటారట.

ప్రపంచ జనాభాలో దాదాపు 65 శాతం మంది మేక పాలను తాగుతారు. యునైటెడ్ స్టేట్స్‌లో మేక పాలు ఒక ప్రత్యేక వస్తువుగా పరిగణించబడుతున్నాయి. అమెరికన్లు ఆవు లేదా మొక్కల ఆధారిత పాలు వైపు ఆకర్షితులవుతున్నప్పటికీ, మేక పాలను ఎంచుకోవడానికి అనేక ఆరోగ్య సంబంధిత కారణాలు ఉన్నాయి.

దేశవాళీ ఆవు పాలను జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందుకే ఔషధ మొక్కల నుంచి తయారైన పాలను లేదా ఇతర జంతు ఆధారిత పాలను ప్రయత్నించడానికి ఇష్టపడుతున్నారు. మేక పాలకు, ఆవు పాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి మేక పాలలో ప్రోటీన్ 9 గ్రాములు, కాల్షియం 330 గ్రా ఉంటే, ఆవు పాలలో ప్రొటీన్ 8 గ్రాములు, కాల్షియం 300 గ్రా ఉంటుంది.

వివిధ పరిశోధనల ప్రకారం మేక పాలు ఇతర ఆహార పదార్ధాల నుండి ముఖ్యమైన పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని పెంచుతుందని కూడా సూచిస్తుంది. ఆవు పాలు ఇనుము, రాగి వంటి కీలక ఖనిజాలను గ్రహించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

ఆవు పాలు కంటే మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి. జంతువుల నుండి పొందిన అన్ని పాలలో కొంత లాక్టోస్ (సహజ చక్కెర) ఉంటుంది, వయస్సు పెరిగే కొద్దీ జీర్ణ సామర్థ్యం తగ్గుతుంది. ఆవు పాలు కంటే మేక పాలలో లాక్టోస్‌ తక్కువగా ఉంటుంది. మేక పాలను పెరుగుగా మార్చినప్పుడు లాక్టోస్ మరింత తక్కువగా ఉంటుంది. "ప్రీబయోటిక్" కార్బోహైడ్రేట్లు మేక పాలలో అధికంగా ఉంటాయి.

ఈ కార్బోహైడ్రేట్లను ఒలిగోసాకరైడ్స్ అంటారు . ఇవి మానవ రొమ్ము పాలలో ఉండే ఒక రకమైన కార్బోహైడ్రేట్. శిశువు జీర్ణవ్యవస్థకు సహకరించే "మంచి" బ్యాక్టీరియా ఇది. ఇటీవలి కాలంలో మొక్కల ఆధారిత పాలు శాకాహారులకు అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి. మొక్కల ఆధారిత పాలల్లో కొన్ని ప్రముఖ రకాలు:

కొబ్బరి పాలు

అవిసె పాలు

జనపనార పాలు

బియ్యం పాలు

సోయా పాలు

ఈ పాలలో పోషకాలు గణనీయంగా ఉన్నప్పటికీ అవి ప్రాసెస్ చేయబడిన పాలు. పైగా మొక్కల ఆధారిత పాలలో మేక పాల కంటే తక్కువ ప్రోటీన్‌‌లు ఉంటాయి. అలాగే బాదం, కొబ్బరి పాలలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. బాదం, కొబ్బరి మొదలైనవి పోషకాలతో నిండి ఉంటాయి. అవి పాలుగా మారిన తర్వాత దాదాపు 98 శాతం నీటిని కలిగి ఉంటాయి.

మొక్క ఆధారిత పాలలో, జనపనార పాలు, కొబ్బరి పాలు అత్యధిక కొవ్వు పదార్థాలు గుండెకు ఆరోగ్యాన్నిచ్చే కొవ్వులు ఉంటాయి. అయితే కొబ్బరి పాల కంటే మేక పాలలో ప్రధానంగా సంతృప్త కొవ్వు ఉంటుంది.

డెంగ్యూ జ్వరాన్ని మేకపాలు తగ్గిస్తాయన్న నమ్మకం మధ్యప్రదేశ్‌ చత్తర్‌పుర్ జిల్లా వాసుల్లో ఎక్కువగా ఉంది. దీంతో మేకపాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో మేక పాలు లీటర్ ధర రూ.30 నుంచి రూ.40 ఉండేదల్లా అమాంతంగా పెరిగి రూ.300 నుంచి రూ.400 కు చేరుకున్నాయి. అయితే మేక పాలు తాగితే డెంగ్యూ రోగులకు ఉపయోగమే కానీ, దాని వల్ల జబ్బు నయం కాదని అది అపోహ మాత్రమే వైద్యులు వివరిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story