Sugarcane benefits: ఎండవేడిమి నుంచి ఉపశమనం.. చెరకు రసంతో ఆరోగ్యం.. .

Sugarcane benefits: ఎండవేడిమి నుంచి ఉపశమనం.. చెరకు రసంతో ఆరోగ్యం..               .
Sugarcane benefits: చెరకు రసంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. వైద్యులు, పోషకాహార నిపుణులు ఆరోగ్యానికి చెరుకును పోషకాల గనిగా వర్ణిస్తారు

Sugar Cane Benefits: చెరకు రసంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. వైద్యులు, పోషకాహార నిపుణులు ఆరోగ్యానికి చెరుకును పోషకాల గనిగా వర్ణిస్తారు.

చెరకు రసం యొక్క ప్రయోజనాలు..


చెరకు రసం అనేక ఆరోగ్య సమస్యల నివారిణిగా చెప్పబడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది .

ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది సాధారణ జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది.

శరీరం యొక్క ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది. ఇవి కాకుండా, చెరకు రసం యొక్క మరికొన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు..

1. చెరకు రసం యొక్క అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.. మూత్ర సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

2. ఆయుర్వేదం ప్రకారం , చెరకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందువలన కామెర్లు వచ్చిన వారు చెరకు రసాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది త్వరగా కోలుకోవడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

చెరకు రసం యొక్క మరొక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే, ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఐరన్, పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని చేకూరుస్తుంది. ప్రత్యేకించి వేసవి కాలంలో ప్రతి రోజు ఒక గ్లాసు చెరకు రసం తీసుకోవడం వలన వేసవి కారణంగా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది. శరీరం అలసటకు గురికాకుండా చూస్తుంది.

4. ఆయుర్వేదం కూడా చెరకు రసాన్ని అత్యంత ఆరోగ్య ప్రదాయినిగా అభివర్ణిస్తారు. చెరకు రసం ప్రేగు కదలికను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. చెరకు రసం ఆల్కలీన్ లక్షణాలను కలిగి ఉంది. అందువలన ఇది అసిడిటీ, కడుపు మంటను నయం చేయడానికి మంచి మందుగా పని చేస్తుంది.


5. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. చెరకు రసం తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెద్దగా మారవని ఒక అధ్యయనంలో తేలింది. అయితే మీరు చెరకు రసం తాగడం ప్రారంభించే ముందు వైద్యుడిని ఒకసారి సంప్రదించడం మంచిది.

6. చెరకు రసంలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. దంత క్షయం వంటి వ్యాధులను, నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుంది.

వేసవిలో విరివిగా దొరికే చెరకు రసం ప్రతి రోజు తీసుకోండి. దాని ప్రయోజనాలను ఆస్వాదించండి!

ప్రపంచంలోనే అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం ఒకటి. బ్రెజిల్ తర్వాత భారతదేశంలోనే చెరుకు అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. దేశంలోని చెరకు ఉత్పత్తిలో మొదటి 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటాయి.

ప్రపంచంలోని చక్కెరలో 70% చెరకు నుండి తయారు చేయబడుతుంది. మిగిలిన 30% చక్కెర.. దుంప పంటల నుండి వస్తుంది. భారతదేశంలో పండించే చాలా చెరకును మొదట బెల్లం, బ్రౌన్ షుగర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆపై చక్కెర తయారీ కోసం రసాయనాలు, సల్ఫర్ ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. మిగిలిన పీచును ఇంధనంగా లేదా కాగితం లేదా సౌండ్ ఇన్సులేటింగ్ బోర్డులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

కొన్ని దేశాల్లో చెరకును ఆల్కహాల్ తయారీకి కూడా ఉపయోగిప్తారు. చెరకులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కాల్షియం, ఐరెన్, పొటాషియం, సోడియం వంటి పోషక విలువలు అధికంగా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story