Hair Fall: కరోనా ఎఫెక్ట్.. జుట్టు ఊడుతుంటే..

Hair Fall: కరోనా ఎఫెక్ట్.. జుట్టు ఊడుతుంటే..
ఇటీవలి అధ్యయనం ప్రకారం కోవిడ్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలలో ఒకటిగా జుట్టు రాలడాన్ని నివేదించాయి.

కరోనావైరస్ మన జీవితాల్లోకి ప్రవేశించి దాదాపు సంవత్సరం గడిచి పోయింది. COVID-19 రోగులు కోలుకున్న చాలా కాలం తర్వాత కూడా సమస్యలను భరిస్తూనే ఉన్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం కోవిడ్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలలో ఒకటిగా జుట్టు రాలడాన్ని నివేదించాయి.

కోవిడ్ నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత కూడా ఈ లక్షణాలను ఎదుర్కొంటున్నారని ఇటీవలి లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. వీటిలో జుట్టు రాలడం ఆందోళన కలిగించే ప్రధాన వనరు.

జుట్టు రాలడం అనేది ప్రబలంగా మరియు వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య అయితే. ఇటీవలి పరిశోధనలు ఇది కరోనావైరస్ లక్షణంగా ఉండవచ్చని సూచించాయి.

ది లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నాలుగింట ఒక వంతు మంది COVID-19 యొక్క ప్రభావానంతరం జుట్టు రాలడాన్ని ఫిర్యాదు చేశారు.

చైనాలోని వుహాన్‌లో ఆసుపత్రిలో చేరిన 1,655 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వీరిలో 359 మంది (22%) డిశ్చార్జ్ అయిన ఆరు నెలల తర్వాత జుట్టు రాలడం ఎదుర్కొన్నారు.

జుట్టు రాలడం పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. జుట్టు రాలడంతో పాటు అలసట లేదా కండరాల బలహీనత, నిద్ర ఇబ్బందులు, ఆందోలన, నిరాశ వంటి లక్షణాల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి.

కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టుకి తగినంత పోషణ అందుతుంది. ఫలితంగా జుట్టు కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.

బాదం-వాల్‌నట్స్



రోజూ ఏడు బాదం గింజలు, రెండు వాల్ నట్స్ తీసుకోవాలి. బాదం గింజల్లో పుష్కలంగా లభ్యమయ్యే మెగ్నీషియం కేశాల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీంతో జుట్టు రాలే సమస్య అరికట్టబడుతుంది. వాల్ నట్స్‌లో ఉండే పొటాషియం కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.

చియా, గుమ్మడి, అవిసె గింజలు




ఈ మూడు గింజలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. చియా గింజల్లోని ఫాస్పరస్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అవిసె గింజల్లో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కొబ్బరి నూనె



ఒక స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పరగడుపు తీసుకోవాలి. ఇది వెంట్రుకల మొదళ్లను దృఢంగా మార్చుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

గుడ్లు




గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చసొనలో ఉండే విటమిన్స్, మినరల్స్ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి.

Tags

Read MoreRead Less
Next Story