'విడాకులు తీసుకున్న వ్యక్తిగా చనిపోవడం ఇష్టం లేదు...': 82 ఏళ్ల మహిళ కోరికను మన్నించిన సుప్రీం

విడాకులు తీసుకున్న వ్యక్తిగా చనిపోవడం ఇష్టం లేదు...: 82 ఏళ్ల మహిళ కోరికను మన్నించిన సుప్రీం
అంత జీవితాన్ని చూశారు. అయినా ఎందుకో ఆ పెద్దాయనకు భార్య నచ్చలేదు.. 82 ఏళ్ల వయసున్న తన అర్థాంగికి విడాకులు ఇవ్వాలనుకున్నారు.

అంత జీవితాన్ని చూశారు. అయినా ఎందుకో ఆ పెద్దాయనకు భార్య నచ్చలేదు.. 82 ఏళ్ల వయసున్న తన అర్థాంగికి విడాకులు ఇవ్వాలనుకున్నారు. అందుకోసం కోర్టును ఆశ్రయించారు. కానీ ఎంతో ఉదార హృదయం ఉన్న ఆమె మాత్రం మరణానికి చేరువలో ఉన్న మేము ఇప్పుడు విడాకులు తీసుకోవడం భావ్యం కాదు. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వ్యక్తిగా చనిపోవడం ఇష్టం లేదు అని కోర్టు వారికి వినమ్రంగా తెలియజేసింది. కోర్టు ఆమె మాటల్ని గౌరవించింది.

భార్య తన భర్తను చూసుకోవడానికి సిద్ధంగా ఉందని, జీవితం చివరి దశలో ఉన్న ఆమెకు అతన్ని విడిచిపెట్టే ఆలోచన లేదని, విడాకులు పొందడం ఇష్టం లేదని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

విడాకుల కేసులు పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో వివాహాన్ని ఇప్పటికీ పవిత్రమైన సంస్థగా పరిగణిస్తున్నారని నొక్కిచెప్పిన సుప్రీంకోర్టు, 82 ఏళ్ల వృద్ధురాలు విడాకులు పొందడం ఇష్టం లేదని విన్నవించడం పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. అందువల్ల, విడాకులు కోరుతున్న ఆమె 89 ఏళ్ల భర్త అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది.

న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 10న భర్త పిటిషన్‌ను తోసిపుచ్చింది. "న్యాయస్థానాలలో విడాకుల విచారణ కేసులు పెరుగుతున్నప్పటికీ, వివాహ వ్యవస్థ ఇప్పటికీ భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య బంధం పవిత్రమైన పరిగణించబడుతుంది" అని కోర్టు పేర్కొంది.

భార్య తన భర్తను చూసుకోవడానికి సుముఖంగా ఉందని, ఆ తర్వాతి సంవత్సరాల్లో అతడిని విడిచిపెట్టే ఆలోచన లేదని, ఆమె విడాకులు పొందడం ఇష్టం లేదని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

విడాకుల కోసం 89 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ జంటకు 1963లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భారత సైన్యంలో పనిచేసిన భర్త జనవరి 1984లో మద్రాస్‌లో ఉన్నప్పుడు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆమె మొదట్లో తన భర్త తల్లిదండ్రులతో, తరువాత తన కొడుకుతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. భార్య నిర్ణయం భర్తకు నచ్చలేదు. ఇదే విషయంపై తరచు గొడవలు జరుగుతున్నా సర్దుకు పోతున్నారు. కానీ ఇప్పడు ఇక సహించేది లేదంటూ కోర్టు మెట్లెక్కారు ౮౪ ఏళ్ల వృద్దుడు.

వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త చేసిన అభ్యర్థనను జిల్లా కోర్టు అనుమతించింది. అయితే పంజాబ్, హర్యానా హైకోర్టు జిల్లా జడ్జి ఆదేశాలను పక్కన పెట్టింది, దాని తర్వాత అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు కూడా భార్య భర్తల వాదనలు విన్న తరువాత భార్య అభ్యర్ధనను మన్నించి ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story