శీతాకాలంలో ప్రతిరోజూ పెరుగు తింటే..

శీతాకాలంలో ప్రతిరోజూ పెరుగు తింటే..
పాలకంటే పెరుగు, మజ్జిగ ఉత్తమమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

పాలకంటే పెరుగు, మజ్జిగ ఉత్తమమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణక్రియకు తోడ్పడుతుంది.చలికాలంలో పెరుగు తినేటప్పుడు చేయవలసినవి, చేయకూడనివి చాలా ఉన్నాయి. చలికాలంలో ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే శరీరానికి ఏమి జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. చాలా మంది సలహా ఇస్తుంటారు.. శీతాకాలంలో పెరుగు తినకూడదు.. జలుబు చేస్తుంది అని. మరి అందులో ఉన్న నిజం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా శీతాకాలంలో పెరుగు తినొచ్చాల లేదా అని ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక పోస్ట్ పెట్టారు. పెరుగు చల్లగా ఉంటుంది అనేది కరెక్ట్ కాదు అని అంటారు ఆయన. ఇది వెచ్చగా ఉంటుంది, శరీరంపై వేడి ప్రభావాన్ని చూపుతుంది. “చలిగా ఉండే శీతాకాలం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు దీన్ని మీ శీతాకాలపు ఆహారంలో చేర్చుకోవచ్చు అని చెబుతారు. ఇది మీ ప్రేగులకు అవసరమైన ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్‌లను కలిగి ఉన్నందున దీనిని ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి అని చెబుతున్నారు.

పెరుగు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో అంతర్గతంగా వేడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. "ఈ ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు తోడ్పడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి మీకు సహాయపడతాయి" అని కుక్రేజా చెప్పారు.

అయితే, మీరు జలుబు చేసినప్పుడు రిఫ్రిజిరేటర్ నుండి నేరుగా తీసిన పెరుగు తింటే, దాని ఉష్ణోగ్రత కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. "గది ఉష్ణోగ్రత ఉన్న పెరుగును నల్ల మిరియాల పొడితో కలిపి తింటే గొంతు నొప్పి వంటి సమస్యలు ఉండవు అని కుక్రేజా పేర్కొన్నారు.

“రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల మీ శరీరంలో కాల్షియం పెరుగుతుంది. ఇది కార్టిసాల్ విడుదలను పరిమితం చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది అని తెలిపారు. పెరుగులో బయోయాక్టివ్ పెప్టైడ్‌లు ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి అని ఆరోగ్య నిపుణుడు డానిష్ అబ్బాసీ చెప్పారు. "అదనంగా, పెరుగులోని ప్రోబయోటిక్స్ మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి పెరుగు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి’’ అని అబ్బాసీ అన్నారు.

పెరుగు మీ శరీరాకృతి సవ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. "శీతాకాలంలో పెరుగు తినకూడదనేది అపోహ మాత్రమే అని ఆయన అన్నారు. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి వార్మింగ్ ఫుడ్స్‌తో సమతుల్యం చేసుకోవడం చాలా అవసరం ”అని వైద్యులు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story