Piles: పైల్స్ తో బాధపడుతున్నారా.. అయితే పొరపాటున కూడా వీటిని..

Piles: పైల్స్ తో బాధపడుతున్నారా.. అయితే పొరపాటున కూడా వీటిని..
Piles: పైల్స్ వ్యాధి ఏ వయస్సు వారికైనా సంభవించవచ్చు. ఈ వ్యాధికి ప్రధాన కారణం మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, జీర్ణ సమస్యలు.

Piles:పైల్ తో బాధపడేవారు ఇతరులతో ఆ విషయాన్ని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గుపడే సమస్యగా భావిస్తారు. వైద్యుని వద్దకు వెళ్లడాన్ని కూడా వాయిదా వేస్తుంటారు. కానీ అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించి ఆ సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.

పైల్స్‌ను హెమోరాయిడ్స్ అని కూడా అంటారు. పైల్స్ ఉన్న వ్యక్తి మలద్వారం వెలుపల, లోపల వాపు ఉంటుంది. విసర్జించే సమయంలో నొప్పి ఉంటుంది. రక్తం కూడా కారుతుంటుంది. ఈ సమస్య ఉంటే మలవిసర్జన సమయంలో కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.

పైల్స్ వ్యాధి ఏ వయస్సు వారికైనా సంభవించవచ్చు. ఈ వ్యాధికి ప్రధాన కారణం మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, జీర్ణ సమస్యలు. ఇటువంటి పరిస్థితిలో పైల్స్ ఉన్నప్పుడు ఏ పదార్థాలు తినకూడదో ఈ రోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.

పైల్స్‌తో బాధపడుతున్నప్పుడు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో చూడండి.

1. డీప్ ఫ్రైడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు


ఫ్రోజెన్ మీల్స్, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం. వాటిలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఉప్పు పుష్కలంగా ఉంటుంది. అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియ వ్యవస్థను దెబ్బతీస్తాయం. మలబద్ధకానికి దోహదం చేస్తాయి.

2. స్పైసీ ఫుడ్


మీకు పైల్స్ ఉంటే, స్పైసీ ఫుడ్ తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ లు, పిజ్జాలు పైల్స్ బాధను మరింత పెంచుతాయి.

3. మద్యం


ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా మానేయాలి. లేదా తగ్గించాలి. ఆల్కహాల్ జీర్ణ సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రేగులపై డీహైడ్రేటింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది.

4. పాల ఉత్పత్తులు


పాల ఉత్పత్తులు చాలా సార్లు గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. మలబద్ధకానికి దారితీస్తుంది. పాలు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు వ్యాధి ప్రబలినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి, మీ రోజువారీ పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం మంచిది.

5. పండని పండ్లు


పైల్స్ బాధ నుంచి బయటపడడానికి పండ్లు ఉత్తమమైన ఆహారం. అయితే, పండిన పండ్లను మాత్రమే తీసుకోవాలి. పండని పండ్లు పైల్స్ నొప్పిని, బాధను మరింత పెంచుతాయి.

6. శుద్ధి చేసిన ధాన్యాలు


వైట్ రైస్, వైట్ బ్రెడ్, కుక్కీలు, కేక్‌లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలలో ఫైబర్‌లో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

7. అధిక సాల్టెడ్ ఆహారాలు


అధిక ఉప్పు కంటెంట్ శరీరంలో నీరు నిల్వ ఉండడానికి కారణమవుతుంది. ఇది రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవాలి.

8. ఐరన్ సప్లిమెంట్స్ మరి కొన్ని ఇతర మందులు


పైల్స్‌తో బాధపడే ముందు మీరు ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్నారేమో ఆలోచించండి. అధికంగా ఇనుము తీసుకుంటే అది మలబద్ధకానికి దారి తీస్తుంది. అలాగే సాధారణంగా ఉపయోగించే కొన్ని మందులు (ఉదాహరణకు, జలుబు మరియు దగ్గు) కూడా మలబద్ధకానికి దారి తీస్తాయి.

9. అధిక ఫైబర్


మలబద్ధకం నుండి ఉపశమనానికి ఫైబర్స్ తినమని చాలా మంది మీకు చెబుతున్నప్పటికీ ఫైబర్ సప్లిమెంట్లను డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. పైల్స్ తో బాధపడుతున్నవారు అధిక ఫైబర్ ఆహారాలను తీసుకోకూడదు.

ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు

- గోరువెచ్చని నీటిలో కూర్చోవడం ( సిట్జ్ బాత్ ) గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది.

- హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగండి.

- మల విసర్జన సమయంలో ఒత్తిడి పడకుండా ప్రయత్నించండి.

- క్రమం తప్పకుండా వ్యాయామం.

– పైల్స్ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Tags

Read MoreRead Less
Next Story