Curd: శీతాకాలంలో రాత్రిపూట పెరుగు తినడం మంచిదేనా..

Curd: శీతాకాలంలో రాత్రిపూట పెరుగు తినడం మంచిదేనా..
Curd: పెరుగు పుల్లని, తీపి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో కఫ దోషాన్ని పెంచుతుంది.

Curd: అసలు పెరుగన్నం తినకుండా భోజనం ఎలా ముగుస్తుంది.. ఇక పిల్లలకైతే అమ్మ చేసిన కూర నచ్చకపోతే పెరుగన్నం తినడం ఓ బెస్ట్ ఆప్షన్.. పెద్దవాళ్లు కూడా పెరుగన్నం తినడాన్ని ఇష్టపడతారు. నిజానికి పెరుగులో మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు ఉపకరిస్తుంది. పాలు ఇష్టపడని వారికి పెరుగు అద్భుతమైన ప్రత్యామ్నాయం. పెరుగు ఒంట్లో వేడిని తక్షణం తగ్గిస్తుంది. గుండెకు మంచిది. పెరుగులో ఉన్న అధిక కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ కారణంగా దంతాలకు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.



అయితే కొందరు నిపుణులు పెరుగుని రాత్రి పూట ఆహారంలో తీసుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ప్రతి మనిషిలో మూడు ప్రాథమిక దోషాలు ఉన్నాయి.. అవి వాత, పిత్త, కఫ దోషాలు.. వీటి మధ్య సంపూర్ణ సమతుల్స స్థితి ఉండాలి. పెరుగు పుల్లని, తీపి లక్షణాలు కలిగి ఉంటుంది.



ఇది శరీరంలో కఫ దోషాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో శరీరంలో కఫ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇది గొంతులో శ్లేష్మ వృద్ధికి దారి తీస్తుంది. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శిల్పా అరోరా మాట్లాడుతూ.. రాత్రి పూట పెరుగు తినడం చాలా మంచిది అని అంటారు.



అయితే ఆస్తమా లేదా దగ్గు, జలుబుతో బాధపడేవారు మాత్రం రాత్రి పూట పెరుగుకు దూరంగా ఉండాలని తెలిపారు. పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అప్పుడప్పుడు పెరుగు అన్నానికి ఎండుమిర్చి, నల్లమిరియాలు, కరివేపాకు, పోపు గింజలు జోడించి తాళింపు పెట్టిన దద్దోజనం లాంటిది తినడం వలన ఒంట్లో వేడిని ఉత్పత్తి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.



శ్వాసకోశ సమస్యలు లేని వారు పెరుగుని ఆస్వాదించవచ్చు. అందులో కొద్దిగా చక్కెర లేదా బెల్లం కలుపుకుని లస్సీ మాదిరిగా చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిది.

Tags

Read MoreRead Less
Next Story