వారం రోజులుగా తగ్గని జలుబు.. ఒక్కసారి ఈ ముద్ర వేసి చూస్తే..

వారం రోజులుగా తగ్గని జలుబు.. ఒక్కసారి ఈ ముద్ర వేసి చూస్తే..
యోగాలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివే కాకుండా, ముద్రలకు కూడా భిన్నమైన గుర్తింపు ఉంది.

యోగాలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివే కాకుండా, ముద్రలకు కూడా భిన్నమైన గుర్తింపు ఉంది. ఈ ముద్రల ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఈ సీజన్ లో చాలా మంది దగ్గు లేదా జలుబు తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం ఉండడం లేదని ఆందోళన చెందుతుంటారు. లింగ ముద్ర చేయడం ద్వారా, మీరు జలుబు నుండి దూరంగా ఉండవచ్చు. ఈ ముద్ర అగ్ని మూలకాన్ని సృష్టించేందుకు సహాయపడుతుంది.

లింగ ముద్ర అనేది ఆది దేవుడిని సూచించే చేతి సంజ్ఞ. ఇది ఒక సంస్కృత పదం. ఈ ముద్ర పురుషత్వానికి ప్రతీక కాబట్టి దీనిని లింగ ముద్ర అని పిలుస్తారు. ఇది శరీరంలోని అగ్ని మూలకంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా పనిచేస్తుంది.

లింగ ముద్ర ఎలా చేయాలి?

ఈ ముద్రలో అరచేతులను ఇంటర్‌లాక్ చేసి ఎడమ బొటనవేలును పైకి ఉంచాలి. బొటనవేలు అగ్ని మూలకానికి చిహ్నం. లింగ ముద్రను నిర్వహించడం ద్వారా ఈ అగ్నిని బలోపేతం చేస్తారు. ఇది ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ఈ లింగ ముద్ర ఎలా చేయాలో చూద్ధాం.

ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని, చేతులను మోకాళ్లపై ఉంచాలి.

పద్మాసనం , సిద్ధాసనం , స్వస్తికాసనం ఏ ఆసనంలో కూర్చుని అయినా చేయవచ్చు.

వజ్రాసనం మొదలైన ధ్యాన భంగిమలు ముద్రల సాధనకు అనువైనవిగా వివరిస్తారు యోగ సాధకులు.

అనంతరం కళ్ళు మూసుకుని, దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి.

ఇప్పుడు రెండు చేతులను మీ శరీరం ముందుకి తీసుకుని, రెండు అరచేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేయండి.అలా చేస్తున్నప్పుడు కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్లలోకి పోనివ్వండి. అప్పుడు ఎడమ బొటని వేలు నిటారుగా ఉంటుంది.

మనస్సులో ఉన్న ఆలోచనలను తొలగించడానికి ఓంకారాన్ని జపించండి.

శ్వాస సాధారణ స్థితిలో ఉండే విధంగా చూసుకోండి.

ఈ భంగిమను ప్రతిరోజూ 35 నిమిషాలు చేయవచ్చు. లేదా 10 నిమిషాల పాటు రోజుకు మూడు సార్లు చేయండి.

తాడాసనలో నిలబడి కూడా లింగ ముద్రను అభ్యసించవచ్చు. కింద కూర్చోలేని వారు కుర్చీపై కూర్చొని చేయవచ్చు.

లింగ ముద్ర యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు

లింగ ముద్ర ఆధ్యాత్మిక, మానసిక, భావోద్వేగ ప్రయోజనాలను కలిగి ఉంటుందని విశ్వసిస్తారు

శరీరంలో వేడిని పెంచడానికి లింగ్ ముద్రను అభ్యసిస్తారు.

లింగ ముద్రను అభ్యసించడం ద్వారా మీ శరీరంలోని అనవసరమైన కేలరీలు తొలగి ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది.

చలి అధికంగా ఉన్నప్పుడు లింగ ముద్ర సాధన చేయడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ముద్ర బ్రహ్మచర్యానికి ఉపకరిస్తుంది.

ఈ ముద్రను ప్రతి రోజు చేయడం వలన జలుబు, సైనసైటిస్, ఆస్తమా, లో బీపీ వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.

ఉత్తమమైన ఫలితాలు పొందాలంటే కోసం, మీరు రెండు నెలల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.

దుష్ప్రభావాలు

అయితే, అన్ని ముద్రలు ఎటువంటి దుష్ప్రభావాలు కలుగజేయవు. కానీ వేళ్లపై ఒత్తిడి చేయరాదు. ఒత్తిడి ఉంటే, మీ మనస్సు చంచలంగా మారుతుంది.. స్థిరంగా ఉండదు. ఫలితంగా, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది.

పిత్త సమస్యలు ఉన్నవారు ఈ ముద్ర వేయకూడదు. వేసవి కాలంలో ఈ ముద్రను ఎక్కువ సమయం చేయకూడదు. అసిడిటీ, జ్వరం, కడుపు పూత వంటి సమస్యలు ఉన్నవారు ఈ ముద్ర వేయకూడదు.

Tags

Read MoreRead Less
Next Story